ఆర్‌ఐఎల్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్
By D Sayee Pramodh

క్యు1 ఫలితాల అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుపై బ్రోకరేజ్ సంస్థలు పాజిటివ్ అభిప్రాయం వ్యక్తం చేశాయి. క్యు1లో కంపెనీ లాభంలో సుమారు 7 శాతం వృద్ధి నమోదయింది. ఈ నేపథ్యంలో బ్రోకింగ్ సంస్థలు ఆర్‌ఐఎల్‌పై బుల్లిష్‌గా మారాయి.
- బోఫాఎంఎల్: కొనొచ్చు రేటింగ్ కొనసాగింపు. టార్గెట్ ధర రూ. 1560కి పెంపుదల. అన్ని విభాగాల్లో అంచనాలకు మించిన ప్రదర్శన చూపింది. ఈపీఎస్ అంచనాలను 2-3 శాతం మేర పెంచింది. మందకొడి సమయంలో కూడా రిటైల్ విభాగం వృద్ధి అనూహ్యం.
- యూబీఎస్: బుల్లిష్ రేటింగ్ కొనసాగింపు. టార్గెట్ రూ. 1500. క్లిష్ట సమయంలో కూడా కంపెనీ మంచి ప్రదర్శన చూపింది.
- క్రెడిట్‌సూసీ: న్యూట్రల్ రేటింగ్ కొనసాగింపు. టార్గెట్ రూ. 1350. జియో ఫలితాలు బాగున్నాయి. రిఫైనరీపై పెరిగిన వ్యయాలు క్యాపెక్స్‌లో ప్రతిబింబించాయి. రిటైల్ వ్యాపారం స్థిరంగా ఉంది.
- మోతీలాల్ ఓస్వాల్: న్యూట్రల్ రేటింగ్ కొనసాగింపు. టార్గెట్ రూ. 1400. క్యాపెక్స్ కేటాయింపులు బాగున్నాయి. పెట్‌కోక్ గ్యాసిఫైయర్స్ పూర్తిగా అందుబాటులోకి వస్తే క్యాపెక్స్ తగ్గుతుంది. రిటైల్, మొబైల్ విభాగాలు సరైన వాల్యూషన్ల వద్దనే ఉన్నాయి.
- ఎడెల్వీజ్: కొనొచ్చు రేటింగ్ కొనసాగింపు. టార్గెట్‌ను రూ. 1701 నుంచి రూ. 1652కు తగ్గించింది. రిఫైనింగ్ వ్యాపారంలో రికవరీ ఆరంభమైంది. పెట్‌కెమ్ మాత్రం ఇంకా బలహీనంగా ఉంది.
- జెఫర్రీస్: అండర్‌పెర్ఫామ్ రేటింగ్ కొనసాగింపు. టార్గెట్ రూ. 990. అర్పు, రిఫైనింగ్ మార్జిన్లు, పెట్‌కెమ్ వాల్యూంలు తగ్గడంతో మందకొడిగా ఉన్న మౌలిక ప్రదర్శన.
You may be interested
సూచీలకు హెచ్డీఎఫ్సీ ద్వయం షాక్
Monday 22nd July 20193వరోజూ ఆగని పతనం 11350 దిగువకు నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ హెచ్డీఎఫ్సీ గ్రూప్ ద్వయం భారీ పతనంతో మార్కెట్ మూడో రోజూ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 306 పాయింట్లు నష్టంతో 38,031 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లను కోల్పోయి 11, 346.20 వద్ద స్థిరపడ్డాయి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు, దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. అలాగే క్రూడాయిల్ ధరల
హెచ్డీఎఫ్సీ గ్రూప్ షేర్ల భారీ పతనం
Monday 22nd July 20195శాతం క్షీణించిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ 2నెలల కనిష్టానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు హెచ్డీఎఫ్సీ గ్రూప్ షేర్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఈ గ్రూప్‌లో ప్రధాన షేర్లైన హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు , హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు 2-6శాతం క్షీణించాయి. ఈ క్యాలెండర్ ఇయర్లో ఈ గ్రూప్ షేర్లు 12శాతం నుంచి 53శాతం మేర లాభపడ్డాయి. షేర్లు అధిక వాల్యూయేషన్ వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారని