News


కేజీ బ్లాక్‌ వార్తలా? డివిడెండ్‌పై ఆశలా?

Tuesday 4th February 2020
news_main1580813518.png-31507

3 శాతం దూసుకుపోయిన ఆర్‌ఐఎల్‌ షేరు
మంగళవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 3 శాతం దూసుకుపోయింది. కేజీ డీ6 బ్లాకులో ఉత్పత్తి ఈ ఏడాది మధ్య నుంచి ఆరంభమవుతుందన్న వార్తలు, ఏప్రిల్‌లోపు భారీ మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించవచ్చన్న ఆశలు.. షేరులో ఉత్సాహం పెంచాయి. కేజీ బేసిన్‌ డీ6లో ఉత్పత్తికి అన్ని సురక్షిత ఏర్పాట్లు చేశామని ఆర్‌ఐఎల్‌- బీపీ జేవీ ప్రకటించింది. మరోవైపు  ఏప్రిల్‌ అనంతరం డివిడెండ్‌ టాక్స్‌ గ్రహీతలు కట్టాల్సిఉంటుందని బడ్జెట్లో సవరించినందున అంతకుముందే భారీ డివిడెండ్లు ప్రకటించి సొమ్ము చేసుకోవాలని పలు కంపెనీల ప్రమోటర్లు భావిస్తున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన వ్యక్తిగత సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1800 కోట్ల డివిడెండ్‌ పొందాయి. ఆర్‌ఐఎల్‌లో ప్రమోటర్లకు దాదాపు 49 శాతం వాటా ఉంది. ఏప్రిల్‌ ఒకటి తర్వాత వచ్చే డివిడెండ్లపై ప్రమోటర్లు దాదాపు 43 శాతం పన్ను చెల్లించాల్సిఉంటుంది. డీడీటీ ఎత్తివేయడంతో షేర్‌హోల్డర్లు వారి వారి టాక్స్‌ స్లాబుల ఆధారంగా డివిడెండ్‌ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఘాతం నుంచి తప్పించుకునేందుకే కంపెనీలు మార్చిలోపు డివిడెండ్లు ప్రకటించేందుకు సిద్ధమవుతాయని ఏఎన్‌ఎంఐ ప్రెసిడెండ్‌ విజయ్‌ భూషణ్‌ అభిప్రాయపడ్డారు. ఇందువల్ల మార్చి వరకు నగదునిల్వలు అధికంగా ఉన్న కంపెనీల షేర్లు ర్యాలీ జరపవచ్చన్నారు. 
రిలయన్స్‌ డివిడెండ్‌ చరిత్ర...


గత కొన్నేళ్లలో 2007, 2016లో మాత్రమే ఆర్‌ఐఎల్‌ మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. మిగిలిన సంవత్సరాల్లో సంవత్సరాంత డివిడెండ్‌ను ఇస్తూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ. 6.50 డివిడెండ్‌ ఇచ్చింది. సంస్థ ముందుగా అనుకున్నట్లయితే ఏప్రిల్‌ 17న క్యు4 ఫలితాలు ప్రకటించాల్సిఉంది. ఈలోపే మధ్యంతర డివిడెండ్‌ ఉండొచ్చని అంచనాలున్నాయి. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌ డివిడెండ్‌ ఈల్డ్‌ 0.46 శాతం ఉంది. 2001 నుంచి 2019 వరకు కంపెనీ 19 మార్లు డివిడెండ్లు ఇచ్చింది. 



You may be interested

మల్టీబ్యాగర్‌ను గుర్తించడం కాదు.. కలసి నడవాలి..!

Wednesday 5th February 2020

ఒక స్టాక్‌ను మల్టీబ్యాగర్‌గా గుర్తించడంతోనే సక్సెస్‌ రాదని, అది మల్టీ బ్యాగర్‌ రాబడులు ఇచ్చేంత వరకు.. అవసరమైతే సుదీర్ఘకాలం పాటు ఆ స్టాక్‌లో పెట్టుబడులను కొనసాగించడం ముఖ్యమని పేర్కొన్నారు యూటీఏ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ వెట్రి సుబ్రమణియన్‌. లార్జ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ మధ్య అంతరం, మల్టీబ్యాగర్‌ విషయాలపై తన అనుభవాలను ఆయన ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.   స్మాల్‌క్యాప్‌ వర్సెస్‌ లార్జ్‌క్యాప్‌ ‘‘గత 20 ఏళ్ల డేటాను గమనించినట్టయితే లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్స్‌ అత్యంత

ఎయిర్‌టెల్‌ క్యూ3 గణంకాలపై బ్రోకరేజ్‌ల అంచనాలివే..!

Tuesday 4th February 2020

టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ మంగళవారం మార్కెట్ ముగింపు అనంతరం డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్‌) బకాయిలకు క్యు2లో కేటాయింపులు చేసిన నేపథ్యంలో ఈ డిసెంబర్‌ క్వార్టర్‌లో నష్టాలు తక్కువగా ఉండవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్‌ మొదటి వారంలో టారీఫ్‌ల పెంపు క్వార్టర్‌ లాభదాయకతకు మద్దతునిస్తుంది.  అంచనాలు... ఈ క్యూ3లో కంపెనీ రూ.780.8 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయవచ్చు. ఆదాయం 3.1శాతం

Most from this category