ఆర్ఐఎల్, అరామ్కో డీల్ ఆగినట్లేనా?
By D Sayee Pramodh

భారత్‌కు చెందిన దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు, సౌదీకి చెందిన అరామ్కోకు మధ్య రిఫైనరీ వాటా విక్రయ డీల్‌కు అడ్డంకులు వచ్చాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జామ్‌నగర్ రిఫైనరీలో 25 శాతం వాటా చేతులు మారేందుకు ఇరు కంపెనీలు ఒక డీల్‌పై చర్చలు జరుపుతున్నాయి. కానీ తాజాగా వాల్యూషన్ల విషయంలో ఈ చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది. డీల్‌కు సంబంధిచిన కంపెనీ కోర్వ్యాపారాన్ని మార్కెట్ వర్గాలు దాదాపు 7000 కోట్ల డాలర్లుగా లెక్కించాయి. అయితే కంపెనీ రుణభారమే 5వేల కోట్ల డాలర్ల వరకు ఉన్నట్లు తెలిసింది. కానీ ఇంత వాల్యూషన్లను ఆమోదించడం అరామ్కోకు ఇష్ట లేదని, పెట్రోకెమ్ ఆస్తుల్లో పెట్టుబడులకు కంపెనీ ఆసక్తిగా ఉన్నా, అప్పుల్లో ఉన్న కంపెనీకి ఇంత మొత్తం వెచ్చించడం ఇష్టం లేదని ఈటీ నివేదిక పేర్కొంది. దీంతో పాటు కేవలం ఇండియానే కాకుండా ఇతర ఈశాన్య ఆసియా దేశాల్లో పెట్టుబడులకు కంపెనీ ఆసక్తిగా ఉందని, అందువల్ల తక్కువ వాల్యూషన్లకు ఇతర దేశాల్లో ఆస్తుల కొనుగోలుపై దృష్టి పెట్టిందని తెలిపింది. అందుకే ఆర్ఐఎల్తో చర్చలు ఆగిపోయాయని వెల్లడించింది. ఈ డీల్‌కు సలహాదారైన గోల్డ్‌మన్‌సాక్స్ సైతం డీల్ కార్యరూపం దాల్చకపోవచ్చని భావిస్తోందని నివేదిక పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు శుక్రవారం దాదాపు ఒక్క శాతం నష్టంతో ట్రేడవుతోంది.
You may be interested
స్వల్ప లాభాలతో గట్టెక్కిన సూచీలు
Friday 7th June 2019ట్రేడింగ్ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి అరగంట కొనుగోళ్లతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 39,615.90 వద్ద, నిఫ్టీ 26.90 పాయింట్లు పెరిగి 11,870.65 వద్ద ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావుశాతం మేర తగ్గించినప్పటికీ.., నిన్న మార్కెట్ భారీ నష్టాలపాలైన నేపథ్యంలో నేటి ఇంట్రాడేలో ఆద్యంతం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 19
డీహెచ్ఎఫ్ఎల్ మరో 14 శాతం క్రాష్
Friday 7th June 2019మూడోరోజూ డీహెచ్ఎఫ్ఎల్ షేర్ల పతనం కొనసాగుతుంది. గత ట్రేడింగ్‌లో 15శాతం క్షీణించిన ఈ షేర్లు నేడు తాజాగా మరో 14శాతం నష్టపోయాయి. డిబెంచర్లపై రుణాలను చెల్లించడంలో విఫలం అవుతుండటం, ద్రవ్య నిల్వలు రోజురోజూకు అడుగంటిపోతున్న తరణంలో ఇక్రా, క్రిసెల్ రేటింగ్ సంస్థలు కంపెనీ విడుదల చేసిన రూ.850 కోట్ల విలువైన కమర్షియల్ పేపర్లపై ఇక్రా, క్రిసెల్ రేటింగ్ సంస్థలు రేటింగ్ ‘‘ఎ4’’ నుంచి ‘‘డిఫాల్ట్’’కు డౌన్‌గ్రేడ్ చేశాయి. ఫలితంగా షేరు