STOCKS

News


ఆర్‌ఐఎల్‌ జేవీలో సౌదీ ఆరామ్‌కో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

Monday 12th August 2019
news_main1565589867.png-27705

 • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐల్‌) ఆయిల్‌ అండ్‌ కెమికల్‌ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ ఆయిల్‌, పెట్రోకెమికల్స్‌ వ్యాపారాన్ని ఆర్‌ఐఎల్‌ విభజించి ఏర్పాటుచేసే జాయింట్‌వెంచర్‌ విలువను రూ. 5.32 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఇందులో సౌదీ ఆరామ్‌కో 20 శాతం వాటా కొనుగోలుకు రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఈ మేరకు ఒప్పందంపై అరామ్‌కోతో సంతకాలు చేయనున్నట్లు సోమవారం జరిగిన ఆర్‌ఐఎల్‌ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆ కంపెనీ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ వెల్లడించారు. ఇది ఇండియాలో ఒకే సంస్థలోకి వచ్చిన అతి పెద్ద విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ఒప్పందంగా నిలవనుంది. ఈ భాగస్వామ్యం,  ఆర్ఐఎల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ఆస్తులను కవర్‌ చేస్తుంది. ఏజీఎంలో ముకేష్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు...
 • రిలయన్స్‌ రిటైల్‌ 1.3 లక్షల కోట్ల టర్నోవర్‌తో అతిపెద్ద రిటైల్‌ కంపెనీగా ఎదిగింది
 • మూడవ వార్షికోత్సవం సందర్భంగా, జియో సెప్టెంబర్ 5 న ఫైబర్ సేవలను ప్రారంభించనుంది. దీనితో, 1,600 సిటీలలో 2 కోట్ల ఇళ్లను, 1.5 కోట్ల వ్యాపార సంస్థలను చేరుకోవాలని జియో ఆశిస్తోంది.
 • భారతదేశం భవిష్యత్తు, రిలయన్స్ భవిష్యత్తు  ఇప్పటి కంటే నాకు ఎప్పుడూ ప్రకాశవంతంగా కనిపించలేదు  భారతదేశం న్యూ ఇండియాగా రూపాంతరం చెందుతున్నందున, రిలయన్స్ కూడా న్యూ రిలయన్స్‌గా రూపాంతరం చెందుతుంది.
 • భారత దేశం 2030 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారగలదు
 • ఐఓటీ(ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) ప్లాట్‌ పార్మ్‌, 2020 జనవరి 1 నుంచి వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది.
 • ఐఓటీ, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్, ఎంఎస్‌ఎంఈ బ్రాడ్‌బ్యాండ్ ఈ నాలుగు విభాగాలతో, జియో వృద్ధి పెరుగుతుంది.
 • జియో ఫైబర్ నెలకు రూ .700 నుంచి రూ .10,000  పరిధిలో ఉండనుంది.
 • జియో ఫైబర్‌ కోసం 1.5 కోట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి.
 • జియో, మైక్రోసాఫ్ట్‌లు కలిపి క్లౌడ్ డేటాసెంటర్లను మొదలుపెట్టనున్నాయి. 
 • దేశీయ టెక్నాలజీ స్టార్టప్‌లకు కనెక్టివిటీ, జియో-అజూర్ క్లౌడ్ సేవలను ఉచితంగా అందిస్తాం.
 • చిన్న వ్యాపారాలకు ఖర్చులో 1/10 శాతానికే ఆటోమేషన్ సాధనాలను జియో అందించనుంది.
 • 3 కోట్ల మంది వ్యాపారులు, కిరణా దుకాణ యజమానులను శక్తివంతం చేసే దిశగా కృషి చేస్తున్నాం​
 • రాబోయే 12 నెలల్లో రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లలో ఒకదాన్ని ప్రారంభించనుంది. ఈ నెట్‌వర్క్ మొదటి రోజునే పదివేల నోడ్‌లను కలిగి ఉంటుంది.


RIL

You may be interested

వంట నూనెను బయోడీజిల్‌గా మార్చే పథకం ఆరంభం

Monday 12th August 2019

న్యూఢిల్లీ: వాడేసిన వంటనూనె నుంచి ఉత్పత్తి చేసిన బయోడీజిల్‌ను కొనుగోలు చేసే పథకాన్ని ప్రభుత్వరంగ  ఇండియన్‌ ఆయిల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ప్రారంభించాయి. ప్రపంచ బయోడీజిల్‌ దినోత్సవ సందర్భంగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ అధికారికంగా ప్రారంభించిన ఈ పథకం కింద... 100 పట్టణాల్లో వినియోగించిన మిగిలిన వంట నూనె నుంచి బయోడీజిల్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఆహ్వానించనున్నాయి.

రియల్టీ సమస్యలపై కేంద్రం దృష్టి

Monday 12th August 2019

రియల్టర్లు, గృహ కొనుగోలుదారులతో ఆర్థిక మంత్రి భేటీ న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఇటు రియల్టర్లు, అటు గృహ కొనుగోలుదారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. నిధుల కొరత, డిమాండ్ మందగించడం, ప్రాజెక్టులు నిల్చిపోవడం తదితర సమస్యల గురించి వివరంగా చర్చించారు. తొలి సమావేశంలో రియల్టర్ల తరఫున పరిశ్రమ సమాఖ్యలైన క్రెడాయ్‌, నారెడ్కో

Most from this category