News


‘ఆర్‌వీ 400’ ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేసింది..!

Thursday 29th August 2019
Markets_main1567061720.png-28092

  • వాయిదా పద్దతిలో కొనుగోలుకు అవకాశం
  • నెలకు రూ. 3,499

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌.. తన తొలి ఈ-మోటార్‌సైకిల్‌ ‘ఆర్‌వీ 400’ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నెలవారీ సులభ వాయిదా పద్ధతిలో ఈ బైక్‌ను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పిస్తూ.. స్పెషల్‌ పేమెంట్‌ స్కీంను ప్రకటించింది. నెలకు రూ. 3,499 చొప్పున 37 నెలలు చెల్లించే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఈ బైక్‌ ప్రీ-బుకింగ్స్‌ జూన్‌ 25 నుంచి ప్రారంభం కాగా, తొలుత ఢిల్లీలో వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. అపరిమిత బ్యాటరీ వారంటీ.. ఉచిత నిర్వహణ ప్రయోజనం, ఉత్పత్తి వారంటీ, బీమా అందిస్తున్నట్లు కంపెనీ ఫౌండర్‌ శర్మ వివరించారు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 150 కి.మీ ప్రయాణిస్తుందని, బ్యాటరీని పూర్తిగా చార్జ్‌ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుందని చెప్పారయన. గరిష్టవేగం 85 కిలోమీటర్లుగా ఉండనుందన్నారు. ఇక మరోబైక్‌ ‘ఆర్‌వీ 300’ను కంపెనీ ఆవిష్కరించింది. నెలకు రూ. 2,999 వాయిదాతో ఈ బైక్‌ను అందించనున్నట్లు మైక్రోమాక్స్‌ సహ-వ్యవస్థాపకుడిగా సేవలందించి, ప్రస్తుతం రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌ ఫౌండర్‌గా కొనసాగుతోన్న శర్మ వివరించారు.



You may be interested

రెండు రోజుల పాటు మార్కెట్‌లో అమ్మకాల వెల్లువ?

Thursday 29th August 2019

బ్రోకరేజిలు, క్లయింట్ల ఖాతాలలోని షేర్లను   బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు)లలో తనాఖా పెట్టి మూలధనాన్ని సమకూర్చుకోడాన్ని, ట్రేడింగ్‌ ఖాతాదారులకు పాక్షికంగ చెల్లించినా.. స్టాకులు కేటాయించడాన్ని నిలుపుదల చేస్తూ సెబి జారీ చేసిన కొత్త నిబంధనలు వచ్చే నెల1 నుంచి  అమల్లోకి రానున్నాయి. ఈ గడువు తేదీని పొడిగించాలని బ్రోకర్స్‌ సెబీని కొరినప్పటికి,  సెబీ వారి విజ్ఞప్తులను తోసిపుచ్చింది. ఫలితంగా సెప్టెంబర్‌ 1లోపు బ్రోకర్స్‌ తప్పనిసరిగా రూ.

ఒప్పొ ఫోన్‌ నుంచి ‘రెనో 2’ సిరీస్‌

Thursday 29th August 2019

ధరల శ్రేణి రూ.29,990- 36,990 న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఒప్పొ’ తాజాగా భారత మార్కెట్లోకి ‘రెనో 2’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదలచేసింది. ‘రెనో 2, రెనో 2 జెడ్, రెనో 2 ఎఫ్’ పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లను తాజా సిరీస్‌లో భాగంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెనో 2 ధర రూ.36,990 కాగా, సెప్టెంబర్‌ 20 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రెనో 2 జెడ్

Most from this category