News


ఆరు క్వార్టర్ల కనిష్ఠానికి ఆదాయం

Friday 14th June 2019
news_main1560494386.png-26287

  • సెంటిమెంట్‌ బలహీనం
  • అంతంమాత్రంగానే డిమాండ్‌
  • మెరుగుపడిన మార్జిన్లు: ఇక్రా

ముంబై: భారత కంపెనీల ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ కంపెనీల ఆదాయ వృద్ధి పది శాతంగానే ఉందని, ఇది ఆరు క్వార్టర్ల కనిష్ట స్థాయి అని ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. ఈ రేటింగ్‌ ఏజెన్సీ, వివిధ రంగాల నుంచి కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలను విశ్లేషించి ఈ నివేదికను  రూపొందించింది. వినియోగదారుల సెంటిమెంట్స్‌ బలహీనంగా ఉండటం, డిమాండ్‌ మందకొడిగా ఉండటం వల్ల ఆదాయాలు ఆరు క్వార్టర్ల కనిష్ట స్థాయికి పడిపోయాయంటున్న  ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..., 
- వినియోగదారులతో అనుసంధానమైన రంగాల కంపెనీల ఆదాయ వృద్ది గత క్యూ4లో 4 శాతంగానే నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఇది 28 శాతంగా ఉండటం విశేషం. 
- గత క్యూ3లో 51 శాతంగా ఉన్న కమోడిటీ సంబంధిత రంగాల కంపెనీల ఆదాయ వృద్ధి గత క్యూ4లో 12.4 శాతంగానే ఉంది. 
- వినియోగ సంబంధిత ప్రయాణికుల వాహనాలు, టూ వీలర్లు, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల్లో గత ఆర్థిక సంవత్సరం రెండో అర్థ భాగం నుంచి బలహీనత బాగా ఉంది 
- గత క్యూ4లో ఈ కంపెనీల నిర్వహణ మార్జిన్‌ 44 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. సీక్వెన్షియల్‌గా చూస్తే 23 బేసిస్‌ పాయింట్లు తగ్గి 16.6 శాతానికి చేరింది. 
- ఎయిర్‌లైన్స్‌, సిమెంట్‌, కన్సూమర్‌ ఫుడ్‌, కన్సూమర్‌ డ్యురబుల్స్‌ వంటి కంపెనీల మార్జిన్లు మాత్రం సీక్వెన్షియల్‌గా చూస్తే మెరుగుపడ్డాయి. ఈ కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచడం, దిగుమతుల వ్యయాలు తక్కువగా ఉండటం, కమోడిటీ ధరలు తక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణాలు. 
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌కు డిమాండ్‌ 8 శాతంగానూ, ఉక్కుకు డిమాండ్‌ 7 శాతంగానూ ఉండొచ్చు. 
- టెలికం కంపెనీల పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉండొచ్చు. రుణ భారం తగ్గినా, నిర్వహణ లాభాలు పెరిగినా, సమీప భవిష్యత్తులో టెలికం కంపెనీల పనితీరు బలహీనంగానే ఉండనున్నది. 
- నివాసిత రియల్టీ రంగంలో కూడా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. నిధుల లభ్యత సమస్య కారణంగా రుణాల లభ్యత క్లిష్టంగా మారడం, అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండనుండటం దీనికి కారణాలు.
 
‘వాహన’ డిమాండ్‌ అంతంత మాత్రమే 
వాహన రంగంలో డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉండగలదని ఇక్రా అంచనా వేసింది. వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, వాహనాల ధరలు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ మందకొడిగా ఉండటం, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో నిధలు కొరత సమస్య కారణంగా వాహన రుణాలు అంత సులభంగా లభించకపోవడం దీనికి కారణాలని ఈ సంస్థ పేర్కొంది. భారత్‌ స్టేజ్‌-సిక్స్‌ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి వాహన రంగం ముఖ్యంగా వాణిజ్య వాహన రంగం పుంజుకోవచ్చని తెలిపింది. వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వాహన విడిభాగాల పరిశ్రమ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 10-11 శాతం వృద్ధిని సాధిస్తుందని ఈ సంస్థ అభిప్రాయపడింది.



You may be interested

గ్రూపు కంపెనీల మధ్య మరింత సహకారం అవసరం

Friday 14th June 2019

గ్రూపు కంపెనీల మధ్య మరింత సహకారం అవసరం కలసి పనిచేయాల్సిన అవసరం, అవకాశాలు టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ముంబై: భారీ సంఖ్యలో ఉన్న టాటా గ్రూపు కంపెనీల మధ్య మరింత సహకారం అవసరమని ఆ గ్రూపు చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘గ్రూపు కంపెనీలు కలసి పనిచేసే విషయంలో కొంత మెరుగుదల అయితే ఉంది. అయితే, ఇంకా ఎంతో మెరుగుపడాలి. మరింత సహకరించుకోవాల్సిన అవసరం, అవకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు. టాటా

ఫోర్బ్స్‌ అతిపెద్ద కంపెనీల జాబితాలో ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ

Friday 14th June 2019

ఫోర్బ్స్‌ అతిపెద్ద కంపెనీల జాబితాలో ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీల జాబితాలో దేశీ కంపెనీలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీలు తమ సత్తానుచాటాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదలచేసిన ‘వాల్డ్స్‌ 2,000 లార్జెస్ట్‌ పబ్లిక్‌ కంపెనీస్‌’లో మొత్తం 57 భారత కంపెనీలు స్థానం సంపాదించగా.. ఆర్‌ఐఎల్‌ ఏకంగా 71వ ర్యాంకును, హెచ్‌డీఎఫ్‌సీ 332వ ర్యాంకును సాధించాయి. ప్రత్యేకించి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంలో ఆర్‌ఐఎల్‌

Most from this category