News


పన్ను ఎగవేతదారులను పట్టుకోండి

Saturday 21st December 2019
news_main1576899460.png-30344

  • లక్ష్యాన్ని చేరుకోండి
  • అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశం

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్‌ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్‌ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకుంటే, ఈ వివరాలు వారి వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నుల్లో ప్రతిఫలించడకపోవడం.. అటువంటి సమాచారం జీఎస్‌టీ, ఆదాయపన్ను విభాగాల మధ్య పంపిణీ చేసుకోవడంపై ఇందులో చర్చించారు. ఈ తరహా పన్నుల ఎగవేతదారులను గుర్తించేందుకు సమాచారాన్ని జీఎస్‌టీ విభాగం ఆదాయపన్ను శాఖతో పంచుకోవాలని పాండే కోరారు. నిజాయతీగా పన్నులు చెల్లించే వారిని ఇబ్బంది పెట్టొద్దని, అదే సమయంలో పన్నులు ఎగ్గొట్టే వారిని విడిచి పెట్టొద్దని ఆదేశించారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా 2019-20లో రూ.13.5 లక్షల కోట్ల ఆదాయాన్ని గడించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 



You may be interested

జనవరి 15లోగా తేల్చండి

Saturday 21st December 2019

'కార్వీ-యాక్సిస్‌ బ్యాంక్‌' షేర్ల వివాదంపై  సెబీకి శాట్ ఆదేశాలు న్యూఢిల్లీ: బ్రోకింగ్ సంస్థ కార్వీ తనఖా ఉంచిన షేర్ల స్వాధీనానికి సంబంధించి .. యాక్సిస్ బ్యాంకు పిటీషన్‌పై జనవరి 15లోగా తగు ఉత్తర్వులు ఇవ్వాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం సూచించింది. దీనిపై 15 రోజుల్లోగా తీర్పునివ్వాలంటూ డిసెంబర్ 17న ఇచ్చిన ఆదేశాలను తాజాగా సవరించింది. క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలున్న కార్వీపై (కేఎస్‌బీఎల్‌)

అవరోధాలు సృష్టించే దేశాలపై చర్యలు

Saturday 21st December 2019

అవరోధాలు సృష్టించే దేశాలపై చర్యలు ఎగుమతిదారులకు కేం‍ద్ర మంత్రి పియుష్ గోయల్‌ హామీ న్యూఢిల్లీ: టారిఫ్‌యేతర ఆంక్షలు విధిస్తూ, భారత్‌ నుంచి ఎగుమతులకు అవరోధాలు సృష్టిస్తున్న దేశాల పేర్లు చెప్పాలని వ్యాపారవేత్తలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. అలాంటి దేశాలపై కచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ ఈ విషయాలు తెలిపారు.

Most from this category