News


ఐదేళ్లలో రెట్టింపు కానున్న రిటైల్‌ రుణాలు

Friday 20th December 2019
news_main1576812550.png-30322

రూ.96 లక్షల కోట్లకు..: ఐసీఐసీఐ బ్యాంకు
ముంబై: ఫైనాన్స్‌ సంస్థల రుణ పుస్తకం విలువ 2019 మార్చి నాటికి రూ.48 లక్షల కోట్లుగా ఉండగా, ఇది వచ్చే ఐదేళ్ల కాలంలో 2024 నాటికి రూ.96 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం (ఇల్లు, కారు, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌, క్రెడిట్‌ కార్డులు) కారణంగా రుణ మార్కెట్‌ భారీగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. వినియోగదారుల్లో రుణాలు తీసుకునే ధోరణి పెరుగుతుండడం, అదే సమయంలో వినియోగదారుల డేటా లభ్యత పెరగడం, డేటా అనలైటిక్స్‌ వినియోగం అన్నవి చౌక గృహ రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాల వృద్ధికి దారితీయనున్నట్టు ఈ సంస్థ వివరించింది. ‘‘మార్ట్‌గేజ్‌ రుణ మార్కెట్‌ 2024 నాటికి రూ.46.1 లక్షల కోట్లకు పెరుగుతుంది. అన్‌సెక్యూర్డ్‌ రుణాలు రూ.13.8 లక్షల కోట్లకు చేరతాయి. ఎంఎస్‌ఎంఈ రుణాలు రూ.13.2 లక్షల కోట్లకు, వాహన రుణాలు రూ.17.5 లక్షల కోట్లకు వృద్ధి చెందుతాయి’’అని ఈ నివేదిక అంచనా వేసింది. 



You may be interested

పర్యాటక రంగం.. 50 బిలియన్‌ డాలర్లు

Friday 20th December 2019

2022 నాటికి సాధించాలన్న అమితాబ్‌కాంత్‌ న్యూఢిల్లీ: పర్యాటక రంగం 2022 నాటికి 50 బిలియన్‌ డాలర్ల (రూ.3.55 లక్షల కోట్లు) ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని నీతి ఆయోగ్‌ అమితాబ్‌ కాంత్‌ సూచించారు. ఈ రంగానికి వృద్ధి అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాలు అపారంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఐఐ 15వ వార్షిక పర్యాటక సదస్సు ఢిల్లీలో గురువారం జరిగింది. దీనికి కాంత్‌ హాజరై మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కల్పించే

ఎక్కువ వేతనాలు బెంగళూరులో

Friday 20th December 2019

ఎక్కువగా పారితోషికం ఐటీ రంగంలో వేతన ధోరణులపై రాండ్‌స్టాడ్‌ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేతన చెల్లింపులకు రాజధానిగా బెంగళూరు తన స్థానాన్ని కాపాడుకుంది. అలాగే, అత్యధిక పారితోషికాలు ఐటీ రంగంలో ఉన్నట్టు రాండ్‌స్టాడ్‌ ‘ఇన్‌సైట్స్‌ శాలరీ ట్రెండ్స్‌ 2019’ నివేదిక వెల్లడించింది. బెంగళూరులో జూనియర్‌ స్థాయి ఉద్యోగిపై కంపెనీ వార్షికంగా చేస్తున్న సగటు వ్యయం (సీటూసీ) రూ.5.27 లక్షలుగా ఉంటే, మధ్య స్థాయి ఉద్యోగిపై ఇది రూ.16.45 లక్షలు, సీనియర్‌ లెవల్‌

Most from this category