News


ద్రవ్యోల్బణం రయ్‌

Tuesday 14th January 2020
news_main1578971873.png-30899

- డిసెంబర్‌లో 7.35 శాతానికి 
- అయిదున్నరేళ్ల గరిష్టం
- కూరగాయల రేట్లే కారణం

న్యూఢిల్లీ: ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2018 డిసెంబర్‌లో 2.11 శాతంగా ఉండగా, 2019 నవంబర్‌లో 5.54 శాతంగాను, డిసెంబర్‌లో 7.35 శాతంగాను నమోదైంది. చివరిసారిగా 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని తాకడం ఇదే ప్రథమం. 
    రెండు శాతం అటూ, ఇటూగా ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్‌కు ప్రభుత్వం నిర్దేశించింది. కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆర్‌బీఐ .. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలనే పరిగణనలోకి తీసుకుంటుంది. ధరల పెరుగుదల భయాల కారణంగానే.. గత డిసెంబర్‌లో జరిగిన పరపతి విధాన సమీక్షలో మరో విడత వడ్డీ రేట్లను తగ్గించకుండా ఆర్‌బీఐ కాస్త విరామమిచ్చింది. ఫిబ్రవరి 6న తదుపరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఈ తరుణంలో నిర్దేశించుకున్న స్థాయికి మించి ద్రవ్యోల్బణ గణాంకాలు నమోదు కావడంతో రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లపై తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రవ్యోల్బణ గణాంకాలకు సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే..

- 2018 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో కూరగాయల ధరలు అత్యధికంగా 60.5 శాతం ఎగిశాయి. 
- మొత్తం ఆహార ద్రవ్యోల్బణం 14.12 శాతం పెరిగింది. 2018 డిసెంబర్‌లో ఇది మైనస్‌ 2.65 శాతంగా ఉండగా, గతేడాది నవంబర్‌లో 10.01 శాతంగా ఉంది.
- పప్పుల ధరలు 15.44 శాతం, మాంసం.. చేపల రేట్లు 10 శాతం పెరిగాయి.



You may be interested

టాటాపై వాడియా కేసు వెనక్కి

Tuesday 14th January 2020

పరువు నష్టం దావా ఉపసంహరణ న్యూఢిల్లీ: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. రూ. 3,000 కోట్ల నష్టపరిహారం దావా కూడా వీటిలో ఉంది. వాడియా ప్రతిష్టకు భంగం కలిగించే ఉ‍ద్దేశమేదీ లేదని తమకు లేదంటూ టాటా సహా మిగతా వర్గాలు న్యాయస్థానానికి తెలియజేశారు. హైకోర్టు విచారణలో కూడా ఇదే తేలినందున

ఇవి వ్యాల్యూ స్టాక్స్‌..!

Tuesday 14th January 2020

బ్లూచిప్‌ స్టాక్స్‌ వ్యాల్యూషన్లు చాలా ఖరీదైన స్థాయికి చేరగా, మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో సత్తా ఉన్న కంపెనీల షేర్ల ధరలు ఎంతో ఆకర్షణీయంగా మారాయి. అదే విధంగా లార్జ్‌క్యాప్‌లోనూ కొన్ని స్టాక్స్‌ ర్యాలీలో పాల్గొనని కారణంగా ఎంతో ఆకర్షణీయ ధరల్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు వ్యాల్యూ స్టాక్స్‌ (కంపెనీల వాస్తవ విలువ కంటే తక్కువకు ట్రేడయ్యేవి) వేటలో మునిగిపోయారు. వ్యాల్యూషన్ల పరంగా చౌకగా

Most from this category