News


ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు

Wednesday 4th March 2020
news_main1583296742.png-32263

  • 26 ఏపీఐలు, మందులకు వర్తింపు
  • జాబితాలో పారాసెటమల్‌, బీ1, బీ12

న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో దేశీయంగా ఔషధాల లభ్యతకు సమస్యలు లేకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 26 యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. పారాసెటమల్‌, విటమిన్ బీ1, బీ12 మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. తాజా ఆంక్షలతో ఇకపై వీటి ఎగుమతుల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని డీజీఎఫ్‌టీ మంగళవారం ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. 
    ఔషధాల తయారీలో కీలకమైన ఏపీఐల కోసం భారత్ ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతున్నప్పటికీ .. పరిమిత స్థాయిలో ఎగుమతులు కూడా చేస్తోంది. కరోనా వైరస్ ధాటికి చైనా నుంచి సరఫరా దెబ్బతిన్న కారణంగా .. దేశీయంగా ఏపీఐలు, ఔషధాల కొరత తలెత్తకుండా కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. కేంద్ర ఫార్మా విభాగం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ.. ఈ మేరకు సిఫార్సులు చేసింది. భారత్‌ ఏటా 3.5 బిలియన్ డాలర్ల విలువ చేసే ఏపీఐలను దిగుమతి చేసుకుంటుండగా.. ఇందులో 70 శాతం (దాదాపు 2.5 బిలియన్ డాలర్లు) చైనా నుంచే ఉంటోంది. 



You may be interested

ఆర్‌కామ్‌ దివాలా ప్రణాళికకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం

Wednesday 4th March 2020

న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ దివాలా పరిష్కార ప్రణాళికకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్‌కామ్‌ రుణదాతల కమిటీ (సీవోసీ)లోనూ ఎస్‌బీఐ బోర్డు సానుకూలంగా ఓటు వేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. సీవోసీలో ఆర్‌కామ్‌ పరిష్కార ప్రణాళికపై ఓటింగ్‌ మొదలైందని, ఈ నెల 4న ముగుస్తుందని పేర్కొన్నాయి. పరిష్కార ప్రణాళిక కింద బ్యాంకులకు రూ.23,000 కోట్లు వసూలు కానున్నాయి. యూవీ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూ.14,700 కోట్లకు

ఐటీ ఎగుమతులకు డిజిటల్‌ దన్ను

Wednesday 4th March 2020

సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి అంచనా హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశానికి డిజిటల్‌ వెన్నెముకగా మారిందని, ప్రధానంగా ఐటీ ఎగుమతుల వృద్ధికి బ్లాక్‌ చెయిన్, ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి డిజిటల్‌ టెక్నాలజీ దన్నుగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అరుణ్‌ గోయెల్‌ తెలిపారు. గత దశాబ్ద కాలంగా దేశంలో బలమైన ఐటీ మౌలిక వసతులను ఏర్పాటైందని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్యాంక్‌

Most from this category