News


నేను నంబర్‌ 1, మోదీ నంబర్‌ 2..డోనాల్డ్‌ ట్రంప్‌!

Friday 21st February 2020
news_main1582266995.png-31983

ఫేస్‌బుక్‌లో తాను నంబర్‌ 1 స్థానంలో ఉన్నానని, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తర్వాత రెండో స్థానంలో ఉన్నారని అమెరికా అధక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. లాస్‌వేగాస్‌లో జరిగిన హోప్‌ ఫర్‌ ప్రిసనర్స్‌ గ్రాడ్యూయేషన్‌ సెర్మనీలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. ఫేస్‌బుక్‌లో తనని ఫాలో అవుతున్న యూజర్ల సంఖ్యను బట్టి తాను నంబర్‌ 1 స్థానంలో ఉన్నట్లు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జూకర్‌బర్గ్‌ స్వయంగా తనతో చెప్పారని ట్రంప్‌ వెల్లడించారు. 4.4 కోట్ల మంది ఫాలోవర్లతో మోదీ రెండో స్థానంలో ఉన్నారన్నారు. అధికారిక అంచనాల ప్రకారం ప్రస్తుతం భారత దేశ జనాభా 130 కోట్లుగా ఉంది. దానిలో 4.4 కోట్లమంది మోదీని ఫాలోఅవుతున్నారు. అదేవిధంగా అమెరికా జనాభా 32.5 కోట్లు. దీనిలో 2.7 కోట్లమంది ట్రంప్‌ను ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌కు ఫాలోవర్స్‌ ఎక్కువగా ఉండడంతో ఆయన మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఫేస్‌బుక్‌ ఫాలోవర్స్ నంబర్‌ వన్‌ స్థానలో ఉన్నందుకు ఇటీవలే తనని జూకర్‌బర్గ్‌ అభినందించారని ట్రంప్‌ తెలిపారు. ఈ సందర్భంగా రెండో స్థానంలో ఉన్న మోదీని ట్రంప్‌ అభినందిచారు. అంతేగాకుండా మోదీని ఉద్దేశిస్తూ..మీ దేశంలో జనాభా 134 కోట్లుగా ఉంది, అందువల్ల ఫేస్‌బుక్‌ ఫాలోవర్ల సంఖ్య మీకు ఎక్కువగా ఉండే వెసులుబాటు ఉందని, మా దేశంలో 32.5 కోట్లు మందే ఉన్నారని  వివరించారు. కాగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో తాను నంబర్‌ 1 స్థానంలో ఉన్నట్లు ట్రంప్‌ చెప్పడం ఇదేమీ మొదటి సారి కాదు. అంతకుముందుకు కూడా అయన పలుసందర్బాల్లో దీనిని ప్రస్తావించారు. గత నెలలో దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో కూడా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం ట్రంప్‌ మాట్లాడుతూ..నేను ఫేస్‌బుక్‌లో నంబర్‌ 1 పొజీషన్‌లో ఉన్నాను మరి నంబర్‌ 2 ఎవరో తెలుసా అని ప్రశ్నించారు. ఆ తరువాత ఆయనే నంబర్‌ 2 మోడీ అని చెప్పుకొచ్చారు. You may be interested

నెలరోజులకు టాప్‌-5 స్టాక్‌ సిఫార్సులు

Friday 21st February 2020

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలతో దేశీయ మార్కెట్‌లో గత కొన్ని వారాలుగా అనిశ్చతి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు నెలరోజుల కాలానికి కొన్ని స్టాకులను సిఫార్సు చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని చూద్దాం... బ్రోకరేజ్‌ సంస్థ: నిర్మల్‌ బంగ్‌ షేరు పేరు: యూపీఎల్‌ ప్రస్తుత ధర: రూ.584  రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.704.00 కాలపరిమితి: 1నెల విశ్లేషణ: విదేశాల్లో  సబార్డినేటెడ్ క్యాపిటల్ సెక్యూరిటీల జారీ ఇష్యూ ద్వారా యూపీఎల్‌ తన మొత్తం నికరరుణాన్ని తగ్గించేందుకు

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 75 పాయింట్లు క్రాష్‌..!

Friday 21st February 2020

ప్రపంచ ఈక్వీటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్‌లో  75 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. నిన్నటి నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపు(12079.00)తో పోలిస్తే 75 పాయింట్లను కోల్పోయి 12,004.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో అంతర్జాతీయ వృద్ధి మందగమనం భయాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు ఇంట్రాడేలో 1శాతం నష్టపోగా, నేడు ఆసియాలో

Most from this category