News


ఎయిరిండియా విక్రయానికి కొత్త ప్రణాళిక

Thursday 20th June 2019
news_main1561017012.png-26445

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ఆర్థిక శాఖ మరో కొత్త ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఈ సారి చమురు ధరలు, మారకం రేటు హెచ్చు తగ్గులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వాస్తవానికి ఎయిరిండియాలో గతేడాదే వాటాలు విక్రయించే ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఇలాంటి కారణాల వల్లే విఫలమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై తేల్చి చెప్పడంతో తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనలను ఎయిరిండియా ప్రత్యేక ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఐఎస్‌ఏఎం) ముందు ఆర్థిక శాఖ ఉంచనుంది. ఎయిరిండియాలో మొత్తం 100 శాతం వాటాలు లేదా 76 శాతం వాటాలు విక్రయించాలా అన్న ఆప్షన్ కూడా వీటిలో ఉంటుంది. 
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురితో పాటు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్తగా ఏర్పడే ఏఐఎస్‌ఏఎంలో సభ్యులుగా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియాకు మొత్తం రూ. 55,000 కోట్ల మేర రుణభారం ఉంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించేందుకు 2018లో కేంద్రం ప్రయత్నించింది. అయితే, కొనుగోలుదారు దాదాపు రూ. 30,000 కోట్ల రుణభారాన్ని భరించాల్సి రానుండటంతో విక్రయ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కంపెనీ రుణభారాన్ని కొంత మిగతా సంస్థలకు బదలాయించి, ఎయిరిండియాను విక్రయించే ప్రతిపాదన తెరపైకొచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మరో ప్రతిపాదన సిద్ధమవుతోంది. 



You may be interested

హైదరాబాద్‌లో అమెజాన్‌ భారీ డెలివరీ స్టేషన్‌

Thursday 20th June 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అతిపెద్ద డెలివరీ స్టేషన్‌ను బుధవారం హైదరాబాద్‌లో  ప్రారంభించింది. 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలో నెలకొల్పిన ఈ కేంద్రం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని కస్టమర్లకు వేగంగా ఉత్పత్తులను డెలివరీ చేయడానికి వీలవుతుందని కంపెనీ తెలిపింది. తెలంగాణలో మొత్తం 90 డెలివరీ స్టేషన్లున్నాయని, వీటిలో ఒక్క హైదరాబాద్‌లో 12 విస్తరించాయని అమెజాన్‌ ఇండియా లాస్ట్‌ మైల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌ రోచ్‌లానీ ఈ

తేరుకుంటున్న ఏసియన్‌ పెయింట్స్‌

Thursday 20th June 2019

అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్ఏ, ఎసియన్‌ పెయింట్స్‌ షేర్ల టార్గెట్‌ ధరను రూ. 1,285కు తగ్గించింది. ఇది ఇప్పుడున్న స్థాయికంటే 7 శాతం తక్కువ. రేటింగ్‌ను మాత్రం ‘అమ్మొచ్చు’గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీంతో  ఏసియన్‌ పెయిం‍ట్స్‌ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 1.5 శాతం నష్టపోయింది. అయితే మధ్యాహ్న సమయానికి కోలుకున్న ఎసీయన్‌ పెయింట్స్‌ షేరు బీఎస్‌ఈలో 0.60శాతం లాభంతో రూ.1,390గా ట్రేడవుతోంది. ‘ఏసియన్‌ పెయింట్స్‌ ఫ్రీ క్యాష్‌ ఫ్లో(ఎఫ్‌సీఎఫ్‌) పెరిగినప్పటికి

Most from this category