News


మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్‌’

Thursday 29th August 2019
news_main1567061373.png-28090

ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో.. భారత మార్కెట్లోకి తన ‘ట్రైబర్‌’ కారును బుధవారం ప్రవేశపెట్టింది. ఈ కాంపాక్ట్‌ సెవన్‌ - సీటర్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ ధరల శ్రేణి రూ. 4.95 లక్షలు నుంచి రూ. 6.49 లక్షలుగా ప్రకటించింది. పొడవు 4 మీటర్ల కన్నా తక్కువ ఉన్న ఈ అధునాతన కారులో 1.0-లీటర్‌ 3-సిలెండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చింది. మొత్తం నాలుగు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఈ సందర్భంగా రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. ‘భారత మార్కెట్‌ కోసమే ప్రత్యేకంగా కార్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడి మార్కెట్లో ఏడాదికి ఒక నూతన కారును ప్రవేశపెట్టనున్నాం. 2022 వరకు వీటి విడుదల ఉండేలా నిర్ణయించాం. ట్రైబర్‌ లాంటి కొత్త వాహనాలనే విడుదల చేస్తాం తప్పించి.. బ్రెజిల్, రష్యాలో విజయవంతమైన కార్లను ఇక్కడ ప్రవేశపెట్టడం లాంటి పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తున్నాం. ఇక భారత్‌లోని పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టిసారిస్తున్నాం. నెలకు 500 కార్ల విక్రయాలతో మొత్తం అమ్మకాల్లో ప్రస్తుతం 30 శాతం వాటాను కలిగి ఉన్న గ్రామీణ ప్రాంత విక్రయాలను 2022 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించాం’ అని వ్యాఖ్యానించారు.

భారత మార్కెట్లోకి రెనో ఎలక్ట్రిక్‌ కారు..!
ప్రణాళిక ప్రకారం తమ కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహన(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు వెంకట్రామ్ మామిళ్లపల్లి ప్రకటించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని.. నాణ్యత లేని ఈవీని విడుదలచేసి, వాటిని గ్యారేజీలకు పరిమితం చేయడం కంటే, సమయం తీసుకుని అయినా పటిష్టమైన వాహనాన్ని విడుదలచేస్తామని వివరించారు. 2022 నాటికి రెనో ఈవీ మార్కెట్లోకి వస్తుందని ప్రకటించారు.



You may be interested

ఒప్పొ ఫోన్‌ నుంచి ‘రెనో 2’ సిరీస్‌

Thursday 29th August 2019

ధరల శ్రేణి రూ.29,990- 36,990 న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఒప్పొ’ తాజాగా భారత మార్కెట్లోకి ‘రెనో 2’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదలచేసింది. ‘రెనో 2, రెనో 2 జెడ్, రెనో 2 ఎఫ్’ పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లను తాజా సిరీస్‌లో భాగంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెనో 2 ధర రూ.36,990 కాగా, సెప్టెంబర్‌ 20 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రెనో 2 జెడ్

జీడీపీ అంచనాలకు ఇక్రా కోత

Thursday 29th August 2019

6.7 శాతానికి తగ్గింపు న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలకు ఇండియా రేటింగ్స్‌ కోత పెట్టింది. వృద్ధి రేటు కేవలం 6.7 శాతమే నమోదవుతుందని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 7.3 శాతం. వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణమని పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు 5.7 శాతంగానే ఉంటుందన్నది ఇండియా రేటింగ్స్‌ అంచనా. 

Most from this category