News


టాటాలకు సుప్రీం ఊరట

Saturday 11th January 2020
news_main1578714208.png-30849

ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీ
పునర్‌నియామకపు ఉత్తర్వుపై స్టే న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్‌నియమించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ( నేషనల్‌ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌) ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వ్యులను పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసును మరోరోజు పూర్తిస్థాయిలో విచారణకు చేపట్టనున్నట్లు తెలిపింది.  ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు టాటా సన్స్‌ పిటిషన్‌ లిస్టయ్యింది.  2016లో అర్ధాంతరంగా టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని పునర్‌నియమించాలంటూ 2019 డిసెంబర్ 18న ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. 

టీసీఎస్‌ డైరెక్టర్‌గా మిస్త్రీ పునర్‌నియామకం ఆదేశాలకూ స్టే...
కాగా భారత్‌ ఐటీ సేవల దిగ్గజ సంస్థ-  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) డైరెక్టర్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్‌నియమించాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన ఉత్తర్యులపై కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కంపెనీ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.  పదవీకాలం పూర్తయ్యే వరకూ డైరెక్టర్‌గా మిస్త్రీని పునర్‌నియమించాలని డిసెంబర్‌ 18న ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పుపై ఈ నెలారంభంలో టీసీఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

17న కంపెనీ ఫలితాలు...
ఇదిలావుండగా, టీసీఎస్‌ శుక్రవారం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ, జనవరి 17న డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నట్లు వివరించింది. అదేరోజు బోర్డ్‌ సమావేశం నిర్వహిస్తుంది. ఒకవేళ డివిడెండ్‌ ఏదైనా ప్రకటిస్తే, చెల్లింపులకు జనవరి 25 రికార్డ్‌ తేదీగా ఉంటుంది. 



You may be interested

రూపాయికి నాల్గవ రోజూ లాభం

Saturday 11th January 2020

27 పైసలు పెరుగుదలతో 70.94 వద్ద ముగింపు నాలుగు రోజుల్లో 99పైసలు అప్‌ (అప్‌డేటెడ్‌...) ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం వరుసగా 4వ రోజూ లాభపడింది. 27పైసలు లాభంతో 70.94 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పడుతుండడం ఇందుకు దోహదపడిన అంశం. ఈ నాలుగు రోజుల్లో రూపాయి విలువ 99 పైసలు బలపడింది. వారంలో 86 పైసలు (1.19 శాతం) లాభపడింది. గత ఏడాది అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి

150 మిలియన్‌ డాలర్లు సమీకరించిన జొమాటో

Saturday 11th January 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గుర్గావ్‌కు చెందిన ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ జొమాటో తాజాగా 150 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌ అనుబంధ సంస్థ యాంట్‌ ఫైనాన్షియల్‌ ఈ పెట్టుబడులు పెట్టిందని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, కొత్త ప్రాంతాల్లో విస్తరణతో పాటూ ప్రధాన నగరాల్లో మార్కెట్‌ వాటాను పెంచేందుకు ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొంది. తాజా నిధుల సమీకరణతో జొమాటోలో ప్రధాన వాటాదారు ఇన్ఫో ఎడ్జ్‌

Most from this category