News


మరింత తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Saturday 8th February 2020
Markets_main1581156107.png-31629


శనివారం ఇంధన ధరలు భారీగా తగ్గాయి.  కరోనా వైరస్‌ ప్రభావంతో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ డిమాండ్‌ తగ్గడంతో  క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఒక శాతంపైగా తగ్గాయి.  దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.72.45గా ఉంటే, ముంబైలో రూ.78.11, కోలకతాలో రూ.75.13, చెన్నైలో రూ.75.27 గా  ధరలు ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీలో లీటర్‌ డీజీల్‌ ధర 65.43గా ఉంటే ముంబై లోరూ.68.57, కోల్‌కతాలో రూ.67.79, చెన్నైలో రూ.69.10గా డీజిల్‌ ధరలు ఉన్నాయి. ఈ నెల(ఫిబ్రవరి)లో ఇంధన ధరలు బాగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్రోల్‌ లీటరుపై రూ.82 పైసలు,డీజిల్‌ రూ.85 పైసలు తగ్గుతుందని విశ్లేషకుల అంచనా. కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ 25 పైసలు తగ్గి లీటరు ధర రూ.77.08 కాగా డీజిల్‌ 28 పైసలు తగ్గి రూ. 71.35 రూపాయలుగా ఉంది. నవ్యాంధ్రా విశాఖపట్నంలో పెట్రోల్‌  రూ. 24 పైసలు తగ్గి  లీటరు ధర 76.63 గా ఉంది. లీటర్‌ డీజిల్‌పై 27 పైసలు తగ్గి రూ.70.91 గా ఉంది. 


 



You may be interested

మరో 4 నాలుగు నెలల్లో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

Saturday 8th February 2020

కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి పూర్తి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై రాబోయే రెండు, మూడు, నాలుగు నెలల్లో స్పష్టంగా కనిపిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వెజర్‌ సందీప్‌ సబర్వాల్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ ప్రస్తుతం ఆర్‌బీఐ పాలసీ విధానానికి అనుగుణంగా స్పందిస్తుందని ఆయన అన్నారు. అలాగే సందీప్‌ ​ ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు., ఆర్థిక వ్యవస్థ, రియల్టీ, షుగర్‌ షేర్లపై తన అభిప్రాయాలను ఒక ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఏయూ స్మాల్‌ బ్యాంక్‌.. ర్యాలీ ఎందుకంట?

Saturday 8th February 2020

3 నెలల్లో 70 శాతం ర్యాలీ రూ. 637 నుం‍చి రూ. 1129కు  క్యూ3లో పటిష్ట ఫలితాలు ఇష్యూ ధర రూ. 358 కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఇటీవల మరింత జోరందుకుంది. ఇందుకు కంపెనీ పటిష్ట పనితీరును చూపడం ప్రధానంగా కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-

Most from this category