News


మళ్లీ రిలయన్స్‌ రికార్డు

Saturday 18th January 2020
news_main1579317789.png-31001

  • ఒ‍క ప్రైవేట్‌ కంపెనీ అత్యధిక త్రైమాసిక లాభం ఇదే 
  • వినియోగ వ్యాపారాల జోరు 
  • రిలయన్స్‌ రిటైల్‌కు రికార్డ్‌ స్థాయిలో నిర్వహణ లాభం, ఆదాయాలు
  • కొనసాగుతున్న రిలయన్స్‌ జియో హవా 

ముంబై/న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రికార్డ్‌ స్థాయిలో రూ.11,640 కోట్ల నికర లాభం​(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ3లో రూ.10,251 కోట్ల నికర లాభం వచ్చిందని, 14 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. షేర్‌ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.17.3గా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.18.4కు పెరిగింది. భారత్‌లో ఒక ​ప్రైవేట్‌ కంపెనీ ఒక త్రైమాసిక కాలంలో ఇంత అత్యధిక నికర లాభం సాధించడం ఇదే మొదటిసారి. చమురు శుద్ధి వ్యాపారం లాభాల బాట పట్టటం, కన్సూమర్‌ వ్యాపారాలైన రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియోల జోరు కొనసాగడంతో  నికర లాభం ఈ స్థాయిలో పెరిగింంది.  ఇక ఆదాయం మాత్రం 1.4 శాతం క్షీణించి రూ.1,68,858 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. 

వినియోగ వ్యాపారాలు...వహ్‌వా !
కంపెనీ కన్సూమర్‌ వ్యాపార విభాగాలైన రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియోల జోరు కొనసాగుతోంది. ఈ రెండు వ్యాపారాల స్థూల లాభం రికార్డ్‌ స్థాయిలో పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం నిర్వహణ లాభంలో ఈ రెండు విభాగాల వాటా 25 శాతంగానే ఉంది. ఈ క్యూ3లో ఈ వాటా దాదాపు 40 శాతానికి పెరిగింది. గత క్యూ3లో రూ.1,680 కోట్లుగా ఉన్న రిలయన్స్‌ రిటైల్‌ నిర్వహణ లాభం ఈ క్యూ3లో  62 శాతం వృద్ధితో రూ.2,727 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.35,577 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.45,327 కోట్లకు పెరిగింది.ఈ క్యూ2లో 10,901గా ఉన్న మొత్తం రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్‌ సంఖ్య ఈ క్యూ3లో 11,316కు పెరిగాయి. రిటైల్‌ రంగంలో ఇతర కంపెనీల కన్నా కూడా రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీయే జోరుగా వృద్ధి చెందుతోంది. సగటున 17.6 కోట్ల మంది వినియోగదారులు రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్‌ను సందర్శిస్తున్నారు. ఇది గత క్యూ3 కంటే 43 శాతం అధికం.  
జియో... జిగేల్‌.....
ఇక టెలికం విభాగం రిలయన్స్‌ జియో జోరు కొనసాగుతోంది. గత క్యూ3లో రూ.831 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో  63 శాతం వృద్ధితో రూ.1,350 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఆదాయం రూ.10,884 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.13,968 కోట్లకు పెరిగింది. మొత్తం మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 37 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడి పరంగా వచ్చే నగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) ఈ క్యూ2లో నెలకు రూ.120గా ఉండగా, ఈ క్యూ3లో రూ.128.4కు పెరిగింది. ఈ విభాగం త్రైమాసిక నిర్వహణ లాభం తొలిసారిగా రూ.5,600 కోట్ల మైలురాయిని దాటింది. డేటా ట్రాఫిక్‌ 40 శాతం, వాయిస్‌ కాల్స్‌ 30 శాతం చొప్పున వృద్ధి చెందాయి. 

  • వరుసగా ఆరు క్వార్టర్ల పాటు తగ్గుతూ వచ్చిన ఆయిల్‌ రిఫైనింగ్‌ మార్జిన్లు ఈ క్యూ3లో పెరిగాయి. ఈ విభాగం స్థూల లాభం 12 శాతం వృద్ధితో రూ.5,657 కోట్లకు పెరిగింది. 
  • గత క్యూ3లో 8.8 డాలర్లుగా ఉన్న స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌-ఒక్కో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందు వల్ల లభించే లాభం)ఈ క్యూ3లో 9.2 డాలర్లకు పెరిగింది. అయితే ఈ క్యూ2లో వచ్చిన దాంతో(9.4 డాలర్లు) పోల్చితే ఇది తక్కువే. 
  • రికార్డ్‌ స్థాయిలో (9.9 మిలియన్‌ టన్నులు) చమురును ఉత్పత్తి చేసినప్పటికీ, ఈ విభాగం స్థూల లాభం 29 శాతం తగ్గి రూ.5,880 కోట్లకు పరిమితమైంది. ఇక చమురు, గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తి విభాగం నష్టాలు రూ.185 కోట్ల నుంచి రూ.366 కోట్లకు పెరిగాయి. 
  • ఈ క్యూ2లో రూ.2,91,982 కోట్లుగా ఉన్న రుణ భారం ఈ క్యూ3 చివరికి రూ.3,06,851 కోట్లకు పెరిగింది. నగదు నిల్వలు రూ.1,34,746 కోట్ల నుంచి రూ.1,53,719 కోట్లకు పెరిగాయి. 

రికార్డ్‌ల మీద రికార్డ్‌లు....
ప్రతి త్రైమాసిక కాలంలో కన్సూమర్‌ వ్యాపారాలు రికార్డ్‌ల మీద రికార్డ్‌లను సృష్టిస్తున్నాయి. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్‌ల్లో అమ్మకాలు నిలకడగా పెరుగుతున్నాయి. ఇక అత్యంత చౌక ధరలకే సేవలందిస్తుండటంతో రిలయన్స్‌ జియో  దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం, ఇంధన మార్కెట్లలో ఒడిదుడుకులు చోటు చేసుకోవడం... ఇంధన వ్యాపారంపై ప్రభావం చూపించాయి. పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా రిఫైనింగ్‌ సెగ్మెంట్‌ పనితీరు మెరుగుపడింది. 
-ముకేశ్‌ అంబానీ, సీఎమ్‌డీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 

 



You may be interested

టీసీఎస్‌ లాభం రూ.8,118 కోట్లు

Saturday 18th January 2020

(అప్‌డేటెడ్‌...) 0.2 శాతమే వృద్ధి  7 శాతం పెరిగిన ఆదాయం  ఒక్కో షేర్‌కు రూ. 5 మధ్యంతర డివిడెండ్‌ ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్యూ3లో 8,118 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించినట్లు టీసీఎస్‌ తెలిపింది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.8,105 కోట్ల నికర లాభం వచ్చిందని, 0.2 శాతం వృద్ధి

‘యస్‌ బ్యాంకు’ వార్నింగ్‌ బెల్స్‌..!

Saturday 18th January 2020

యస్‌ బ్యాంకుకు ఇప్పుడు నిధులే ప్రాణవాయువు. ఎంత వేగంగా నిధులు సమీకరిస్తే బ్యాంకు సొంతంగా నిలదొక్కుకునేందుకు, గాడిలో పడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ, కారణాలేవైనా కానీ, నిధుల సమీకరణలో బ్యాంకు తీవ్ర జాప్యం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. పరిస్థితులు చేయి దాటిపోతే ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం పలువురు అనలిస్టుల నుంచి వినిపిస్తోంది.    యస్‌ బ్యాంకు రూ.10,000 కోట్ల నిధులను క్యూఐపీ/జీడీఆర్‌/ఏడీఆర్‌/ఎఫ్‌సీసీబీ ఇలా పలు మార్గాల్లో

Most from this category