News


తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రిలయన్స్ నేవల్‌

Thursday 5th September 2019
news_main1567660917.png-28202

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన సంస్థలు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. తాజాగా రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్‌ (ఆర్‌నేవల్‌) తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటికే పొందిన ఆర్డర్లను పూర్తి చేయడంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. "పలు సవాళ్ల కారణంగా కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. రుణ పరిష్కార ప్రణాళిక ఇంకా సిద్ధం కాకపోవడంతో తీవ్ర నిధుల కొరత నెలకొంది. ఫలితంగా ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి దెబ్బతింటోంది. గడువులు పొడిగించాల్సి వస్తోంది. దీంతో క్లయింట్ల నమ్మకం కోల్పోవాల్సి వస్తోంది" అని వార్షిక నివేదికలో  రిలయన్స్ నేవల్  సీఈవో దేబాశీస్‌ బీర్‌ పేర్కొన్నారు. కొత్త డిఫెన్స్ కాంట్రాక్టులు లేకపోవడంతో రుణాలపై వడ్డీలు చెల్లించేందుకు సరిపడా ఆదాయాలు కూడా లేవని ఆయన వివరించారు. ఇది ఆర్థిక ఒత్తిడిని మరింతగా పెంచేసిందని పేర్కొన్నారు. రుణ పరిష్కార ప్రణాళికను ఒక కొలిక్కి తెచ్చేందుకు రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు దేబాశీస్‌ తెలిపారు. 



You may be interested

మౌలిక రంగం వృద్ధి ఎలా..!

Thursday 5th September 2019

మౌలిక రంగం ప్రతినిధులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం సమావేశమయ్యారు. వృద్ధి, ఉపాధి కల్పన వంటి అంశాల్లో ఈ రంగానికి కీలక పాత్ర ఉన్న నేపథ్యంలో- ఆర్థికమంత్రి జరిపిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మౌలికరంగం పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థికమంత్రి ఈ సమావేశంలో దృష్టి సారించినట్లు సమాచారం. ఆర్థిక మందగమనం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గత నెల నుంచీ ఆర్థికమంత్రి వివిధ వర్గాలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. నీతి

ఎన్‌హెచ్‌ఏఐ పటిష్టంగానే ఉంది

Thursday 5th September 2019

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదు పైప్‌లైన్‌లో ఎన్నో ప్రాజెక్టులు చైర్మన్‌ సిన్హా ప్రకటన న్యూఢిల్లీ: జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదని చైర్మన్‌ ఎన్‌ఎన్‌ సిన్హా స్పష్టం చేశారు. చాలా బలమైన స్థితిలోనే ఎన్‌ఎచ్‌ఏఐ ఉందని, ప్రణాళికలో ఎన్నో ప్రాజెక్టులు కూడా ఉన్నట్టు తెలిపారు. గతేడాది 3,300 కిలోమీటర్ల మేర రహదారుల ప్రాజెక్టులను చేపట్టగా, ప్రస్తుత ఏడాది 4,500 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను నిర్మించనున్నామని ఆయన చెప్పారు.

Most from this category