News


టాప్‌ 6 ఆయిల్‌ దిగ్గజాల్లో ఆర్‌ఐఎల్‌

Wednesday 20th November 2019
news_main1574233172.png-29730

తాజా ర్యాలీతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ అంతర్జాతీయ ఆరు చమురు దిగ్గజాల్లో స్థానం దక్కించుకుంది. ఆర్‌ఐఎల్‌ షేరు కదం తొక్కుతుండడంతో బీపీ సంస్థను తోసిరాజని రిలయన్స్‌ ప్రపంచంలో ఆరో అతిపెద్ద చమురు కంపెనీగా అవతరించింది. బీపీ మార్కెట్‌ క్యాప్‌ 13200 కోట్ల డాలర్లుండగా, మంగళవారం ఆర్‌ఐఎల్‌ 13300 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించింది. మరోవైపు నష్టాల ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో బీపీ షేరు పడిపోవడం ఆ కంపెనీ వాల్యూను తగ్గించింది. ప్రస్తుతం అన్ని రకాల ఎనర్జీ కంపెనీల్లో సౌదీ అరామ్‌ కో టాప్‌లో ఉంది. త్వరలో ఈ కంపెనీ ఐపీఓకి రానుంది. ఐపీఓ అనంతరం సంస్థ విలువ 1.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.

లిస్టయిన ఎనర్జీ కంపెనీల్లో ఎక్సాన్‌ మొబైల్‌ కార్పొరేషన్‌ టాప్‌లో ఉంది. తర్వాత స్థానాల్లో రాయల్‌ డచ్‌ షేల్‌, చెవ్రాన్‌, పెట్రో చైనా, టోటల్‌ ఎస్‌ఏ ఉన్నాయి. ఆసియా నుంచి పెట్రో చైనా ఎనర్జీ కంపెనీల్లో లీడర్‌గా ఉంది. ఈ వారంలో ఆర్‌ఐఎల్‌ షేరు చూపిన ర్యాలీతో ముకేశ్‌ అంబానీ సంపద 5600 కోట్ల డాలర్లను చేరింది. దీంతో ఆలీబాబా సంస్థ అధిపతి జాక్‌ మాను మించి ఆసియాలో కుబేరుడుగా ముకేశ్‌ అవతరించాడు. ఈ ఏడాది ఆర్‌ఐఎల్‌ షేరు దాదాపు 40 శాతం ర్యాలీ జరిపింది. 

అయితే బీపీ ఇతర ఆయిల్‌ కంపెనీలతో ఆర్‌ఐఎల్‌ను పోల్చడానికి వీల్లేదని కొందరు నిపుణుల అంచనా. పైవన్నీ కేవలం చమురు వ్యాపారంలో మాత్రమే ఉండగా, ఆర్‌ఐఎల్‌ అటు చమురుతో పాటు ఇటు టెలికం, రిటైల్‌ తదితర అనేక రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. పైగా తాజా ర్యాలీకి కంపెనీ టెలికం టారిఫ్‌లు పెంచుతామన్న ప్రకటన కారణమైంది. అనుబంధ విభాగాలైన జియో, ఆర్‌ రిటైల్‌ను ప్రత్యేకంగా లిస్టింగ్‌కు తీసుకువచ్చిన తర్వాత మాత్రమే చమురు వ్యాపారంలో ఆర్‌ఐఎల్‌ స్థానం తెలుస్తుందని నిపుణుల అభిప్రాయం. You may be interested

టారీఫ్‌లు పెంచితే...వొడాఫోన్ఐ‌డియా మల్టిబ్యాగర్‌!

Wednesday 20th November 2019

‘టెలికాం సెక్టార్‌కు సంబంధించి నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం, టెలికాం కంపెనీలు, ఈ సెక్టార్‌ దీర్ఘకాల వృద్ధి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి’ అని మార్కెట్‌ విశ్లేషకులు సమీర్‌ నారయణ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. టెలికాం కంపెనీలు..యస్‌ బ్యాంక్‌ యస్‌ బ్యాంక్‌కు టెలికాం సెక్టార్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు స్వల్ప పోలిక ఉంది. ఒకటి నిర్థిష్టమైన బ్యాంక్‌ గురించి చెబుతుంటే, మరోకటి మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థపై పడే

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ @ రూ.10లక్షల కోట్లు

Wednesday 20th November 2019

ముకేశ్ అంబానీ సారథ్యంలోని  దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10లక్షల కోట్లకు అతి చేరువులో ఉంది. రిలయన్స్‌ అనుబంధ టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’ త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారమే ఛార్జీల పెంపు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సెప్టెంబర్ లో కొత్తగా 69.83 లక్షల యూజర్లు జత కావడంతో జియో

Most from this category