News


ఆదాయంలో ‘జియో’ అగ్రస్థానం

Thursday 11th July 2019
news_main1562824306.png-26974

  • మార్చి త్రైమాసికంలో రూ.9,839 కోట్లు ఏజీఆర్‌

న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో.. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) పరంగా టాప్‌ స్థానంలో నిలిచినట్లు ట్రాయ్‌ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోన్న ఈ సంస్థ.. ఏజీఆర్‌ విషయంలోనూ ఇతర కంపెనీలను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరింది. సంస్థకు మొబైల్ ఫోన్ సేవల నుంచి అందే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 3.76 శాతం వృద్ధి చెంది రూ.9,839 కోట్లుగా నమోదైంది. అయితే, ఏడాది ప్రాతిపదికన ఈ స్థాయి వృద్ధి నమోదుకాగా, త్రైమాసికం పరంగా మాత్రం వృద్ధిలో వేగం నెమ్మదించింది. డిసెంబర్‌ త్రైమాసికంలో ఏకంగా 14.6 శాతం వృద్ధిని సాధించిన సంస్థ.. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ పరంగా ఆశించినస్థాయి వేగాన్ని అందుకోలేకపోయింది. ఇక చందాదారుల సంఖ్య పరంగా దేశీ అతిపెద్ద టెలికం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా ఏజీఆర్‌ త్రైమాసికం పరంగా 1.25 శాతం తగ్గి రూ.7,133.4 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌ ఎనిమిది శాతం తగ్గి రూ.5,920.2 కోట్లుగా నిలిచింది.ప్రభుత్వానికి చెందాల్సిన లైసెన్స్, ఇతర రుసుముల వాటా ఏజీఆర్‌ ఆధారంగానే నిర్ణయంకానుండగా.. మొత్తం టెలికం సర్వీసెస్‌ ఏజీఆర్‌లో యాక్సిస్ సేవల వాటా 72 శాతంగా ఉంది. మార్చి క్వార్టర్‌లో లైసెన్స్ ఫీజు రూ.2,888 కోట్లు కాగా, అంతక్రితం త్రైమాసికంలో రూ.2,890 కోట్లుగా ఉంది. పూర్తి టెలికం రంగ స్థూల ఆదాయం (జీఆర్‌) రూ.58,414 కోట్లు, ఏజీఆర్‌ రూ.35,932 కోట్లుగా ఉన్నాయి. 
- పెరిగిన ఏఆర్‌పీయూ...
మార్చి త్రైమాసికంలో ఈ రంగ పనితీరును లెక్కకట్టడంలో భాగంగా ట్రాయ్‌ ‘భారత టెలికం సర్వీసెస్ పనితీరు సూచిక’ పేరిట నివేదికను విడుదలచేసింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. మార్చి చివరినాటికి 118.35 కోట్లకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోయింది. డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చితే 1.20 శాతం, ఏడాది ప్రాతిపదికన 1.88 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్‌లో 91.45 వద్ద ఉన్న మొత్తం టెలీడెన్సిటీ గతేడాది డిసెంబర్‌ నాటికి 90.11 వద్దకు పడిపోయింది. ఒక్కో చందాదారు సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ).. వైర్‌లెస్‌ సేవల పరంగా మార్చి త్రైమాసికానికి 1.80 శాతం పెరిగి రూ.71.39 వద్దకు చేరుకుంది. అంతక్రితం త్రైమాసికంలో ఇది రూ.70.13 వద్ద ఉంది. ప్రీ-పెయిడ్‌ ఏఆర్‌పీయూ రూ.60 నుంచి రూ.63కు చేరింది. You may be interested

రెడీ అవుతున్న హెచ్‌ఎఫ్‌సీఎల్‌ హైదరాబాద్‌ ప్లాంటు

Thursday 11th July 2019

నవంబరులో ప్రారంభానికి సన్నాహాలు మొత్తం రూ.1,000 కోట్ల పెట్టుబడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆప్టికల్‌ ఫైబర్‌ తయారీ సంస్థ హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) హైదరాబాద్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న ప్లాంటు రెడీ అవుతోంది. నవంబరులో తయారీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సంస్థ ఎండీ మహేంద్ర నెహతా వెల్లడించారు. ఫ్యాబ్‌ సిటీలో 20 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ తయారీ కేంద్రానికి కంపెనీ తొలి దశలో రూ.260 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఏటా 1.05 కోట్ల

బుక్‌-మైషోలో వాటా కోసం దిగ్గజాల క్యూ

Thursday 11th July 2019

 కంపెనీ విలువ విలువ వంద కోట్ల డాలర్లపైనే!! ముంబై: ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంస్థ బుక్‌-మైషోలో వాటా కొనుగోలు కోసం పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బుక్‌-మైషోలో 10-12 శాతం వాటా కొనుగోలు కోసం ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం జనరల్‌ అట్లాంటిక్‌, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ టెమసెక్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వాటా కొనుగోళ్లకు

Most from this category