STOCKS

News


ఆ టెల్కోలకు ప్యాకేజీలు అక్కర్లేదు

Friday 1st November 2019
news_main1572579861.png-29272

  • అవి బాకీలు కట్టగలిగే స్థితిలోనే ఉన్నాయి
  • టెలికం మంత్రికి జియో లేఖ

న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ స్థాయిలో లైసెన్సు ఫీజులు బాకీలు కట్టాల్సి రానున్న పాత తరం టెల్కోలు .. ప్రభుత్వాన్ని బెయిలవుట్ ప్యాకేజీ కోరుతుండటంపై రిలయన్స్ జియో మండిపడింది. ఆ రెండు సంస్థలు (భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా) ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయని, ప్రజల సొమ్ముతో వాటికి ప్యాకేజీలేమీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మూడు నెలల్లోగా బాకీలు కట్టేలా వాటిని ఆదేశించాలంటూ కేంద్రాన్ని కోరింది. టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు జియో ఈ మేరకు లేఖ రాసింది. ఒకవేళ రెండు సంస్థలకు ఏం జరిగినా (మూతబడినా) .. ప్రభుత్వ రంగ టెల్కోలు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నందున టెలికం రంగానికి వచ్చిన నష్టమేమీ లేదని అందులో పేర్కొంది. ఇక, ప్రభుత్వం అత్యవసరంగా ఊరట చర్యలు తీసుకోకపోతే.. టెలికం రంగం కుప్పకూలుతుందంటూ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ ఆందోళన వ్యక్తం చేయడంపైనా జియో స్పందించింది. 

సీవోఏఐ బ్లాక్‌మెయిల్ చేస్తోంది ...
"రెండు సంస్థల స్వార్ధ ప్రయోజనాల కోసం వాటి తరఫున వకాల్తా పుచ్చుకుని సీవోఏఐ కేంద్రానికి లేఖ రాసింది" అని ఆక్షేపించింది. జియోపై సీవోఏఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. "ఉద్యోగాలు పోతాయని, సేవల నాణ్యత తగ్గిపోతుందని, టెలికం రంగంలో పెట్టుబడులు ఆగిపోతాయని ప్రభుత్వానికి పంపిన లేఖలో సీవోఏఐ రకరకాలుగా బెదిరింపు, బ్లాక్‌మెయిలింగ్ ధోరణిలో రాసినట్లు కనిపిస్తోంది. బాకీలు డిపాజిట్‌ చేయాలంటూ సుప్రీం కోర్టు మూడు నెలలు గడువిస్తే.. ఇలాంటివన్నీ చేయడం కోర్టు ధిక్కారానికి పాల్పడటమే అవుతుంది" అని జియో పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 'సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)' లెక్కలు బట్టి ప్రభుత్వానికి టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రావొచ్చని అంచనా. పాత తరం టెల్కోలైన భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు, జియో స్వల్పంగా రూ. 14 కోట్లు కట్టాల్సి రానుంది. You may be interested

ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఎన్‌పీఏల ప్రక్షాళన చేపట్టాలి

Friday 1st November 2019

బలమైన వృద్ధికి ఇది అవసరం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రక్షాళన వేగంగా ముగించాలి ఆర్‌బీఐ పూర్వపు గవర్నర్‌ రాజన్‌ సూచన బీజేపీ హయాంలోనే తన పదవీ కాలం ఎక్కువని ప్రకటన న్యూఢిల్లీ: రానున్న కాలంలో పటిష్టమైన వృద్ధి కోసం ప్రభుత్వరంగ బ్యాంకుల మాదిరే ఎన్‌బీఎఫ్‌సీ రంగంలోనూ ఎన్‌పీఏల ప్రక్షాళన అవసరమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. లేదంటే ఆర్థిక రంగానికి భారంగా మారుతుందన్నారు. తన పదవీ కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిల (ఎన్‌పీఏలు)

పాజిటివ్‌ ప్రారంభం

Friday 1st November 2019

గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లుగా పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు...నవంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలిరోజైన శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 66 పాయింట్ల లాభంతో 40,195 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల పెరుగుదలతో 11,886 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై క్రితం రోజు చైనా అనుమానాలు వ్యక్తపర్చడంతో గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు గరిష్టస్థాయి నుంచి క్షీణించాయి. అయితే

Most from this category