త్వరలోనే జియో చార్జీల పెంపు
By Sakshi

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’ త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్ ఫోన్ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర ట్యారిఫ్ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. మిగిలిన టెలికం దిగ్గజాలైన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సోమవారమే పెంపు ప్రకటన చేయగా.. ఒక రోజు తరువాత జియో కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది. దేశీ టెలికం రంగాన్ని బలోపేతం చేసి వినియోగదారులకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా ట్యారిఫ్ను పెంచనున్నామని, జియో వివరణ ఇచ్చింది. దీని వల్ల డేటా వినియోగంపైన, డిజిటల్ అనుసరణపైన ప్రతికూల ప్రభావం ఉండబోదని వ్యాఖ్యానించింది.
You may be interested
ఈ నెల 22 నుంచి సీఎస్బీ ఐపీఓ
Wednesday 20th November 201926న ముగింపు ప్రైస్‌బ్యాండ్ రూ.193-195 వచ్చే నెల 4న లిస్టింగ్ ఇష్యూ సైజు రూ.410 కోట్లు ! ముంబై: కేరళ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీఎస్బీ బ్యాంక్(గతలో కేథలిక్ సిరియన్ బ్యాంక్) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 22 (ఈ శుక్రవారం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 26న ముగిసే ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.193-195ను సీఎస్బీ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.24 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను
ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.95,760 కోట్ల మోసాలు
Wednesday 20th November 2019ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ప్రభుత్వ బ్యాంకింగ్ లెక్కలు రాజ్యసభలో ఆర్థికమంత్రి వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) రూ.95,760 కోట్లకుపైగా మోసాలు చోటుచేసుకున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి 5,743 కేసులు నమోదయ్యాయి. నిధులపరంగా చూస్తే,