News


జియో నుంచి వై-ఫై కాలింగ్‌ సేవలు

Thursday 9th January 2020
news_main1578542812.png-30787

న్యూఢిల్లీ: వై-ఫై ద్వారా కూడా వాయిస్‌, వీడియో కాలింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లల్లో లేదా ఆఫీసుల్లో కాల్స్‌ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై-ఫైకి మారవచ్చని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్‌)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్ల ప్రారంభ జోరు

Thursday 9th January 2020

గురువారం ఆరంభంలో బ్యాంకు నిఫ్టీ దాదాపు ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. బుధవారం క్లోజింగ్‌ 31373 పాయింట్ల నుంచి దాదాపు 400 పాయింట్ల లాభంతో 31748 పాయింట్ల వద్ద ఆరంభమైన సూచీ 31885 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. 9.30 నిమిషాలకు 31818 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సూచీలోని షేర్లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా ఆర్‌బీఎల్‌ బ్యాంకు 3.21 శాతం లాభంతో ఉంది. పీఎస్‌యూ బ్యాంకు సూచీ 1.7 శాతం

వ్యాపారుల కోసం పేటీఎం ఆల్‌-ఇన్‌-వన్‌ క్యూఆర్

Thursday 9th January 2020

ముంబై: డిజిటల్ పేమెంట్స్ సేవల సంస్థ పేటీఎం తాజాగా దేశవ్యాప్తంగా వ్యాపారుల కోసం ఆల్‌-ఇన్‌-వన్‌ క్యూఆర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టింది. పేటీఎం వాలెట్‌, రూపే కార్డులు, అన్ని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్స్ ద్వారా జరిగే చెల్లింపులు నేరుగా వ్యాపారుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. దీనికి ఎటువంటి ఫీజు ఉండదని పేర్కొన్నారు. దీనితో పాటు కస్టమర్ల లావాదేవీల వివరాలను పొందుపర్చే

Most from this category