News


జియో బాదుడు ... 39శాతం పైనే

Thursday 5th December 2019
news_main1575517527.png-30062

  • పెంపులో ఐడియా, ఎయిర్‌టెల్‌ కన్నా ఎక్కువే
  • 39 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్‌ జియో ఛార్జీలు

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో... ఛార్జీలు పెంచుతూ కొత్త రేట్లను బుధవారం విడుదలచేసింది. డిసెంబర్‌ 6 నుంచి ధరలు పెరగనున్నట్లు కంపెనీ గతంలోనే ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యారిఫ్‌లతో పోల్చితే 39 శాతానికి పైగా పెంపును ప్రకటించింది. రోజుకు 1.5 జీబీ డేటాతో 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్యాకేజీ ధర ప్రస్తుతం రూ.399 ఉండగా.. దీని ధరను రూ. 555 చేసింది. రూ.153 ప్లాన్‌ ధర శుక్రవారం నుంచి రూ.199 కానుంది. రూ. 98 ప్లాన్‌ రూ.249 వద్దకు, రూ.299 ప్యాకేజ్‌ రూ.349 వద్దకు చేరుకోనున్నాయి. రూ.349 ప్లాన్‌ రూ. 399గా మారనుంది. రూ.448 ప్లాన్‌ రూ. 599 కానుండగా.. ప్రస్తుతం ఏడాదికి రూ.1,699గా ఉన్న ప్లాన్‌ రూ. 2199కి చేరనుంది. ట్యారిఫ్‌ పెరిగినప్పటికీ.. పోటీ సంస్థలు ఇస్తోన్న ప్లాన్‌లతో పోలిస్తే మాత్రం తమ నూతన ట్యారిఫ్‌ 25 శాతం తక్కువగా ఉన్నట్లు కంపెనీ వివరించింది. రూ. 199 ప్లాన్‌ను ఇతర సంస్థలు రూ. 249కి అందిస్తున్నాయని రకరకాల లెక్కలు వేసి చూపిస్తోంది.

 

జియో పెరిగిన ధరల వివరాలు
ప్రస్తుత ట్యారిఫ్‌ (1.5జీబీ) నూతన ట్యారిఫ్‌
153 199
198  249
299 349
349 399
399 555
448 599 
1,699 2,199

 



You may be interested

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ... అదుర్స్‌

Thursday 5th December 2019

166 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఇష్యూ  ఈ ఏడాది అత్యధికంగా సబ్‌స్క్రైబయిన ఇష్యూ ఇదే  ఈ నెల 12న లిస్టింగ్‌  న్యూఢిల్లీ: ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) అదరగొట్టింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.750 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 12.39 కోట్ల షేర్లు ఆఫర్‌ చేస్తుండగా, 2,053 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు కేటాయించిన వాటా 114

డేటా దుర్వినియోగానికి జైలు శిక్ష ..

Thursday 5th December 2019

కంపెనీలపై రూ. 15 కోట్ల దాకా జరిమానా వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన పక్షంలో కంపెనీలు ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రానుంది. కోట్ల రూపాయల జరిమానాలు కట్టడంతో పాటు వాటి ఎగ్జిక్యూటివ్‌లు జైలు శిక్షలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రస్తుత

Most from this category