News


రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే

Friday 12th July 2019
news_main1562914704.png-27008

  • రిలయన్స్ ఇన్‌ఫ్రా వెల్లడి

ముంబై: దాదాపు రూ. 7,500 కోట్ల రుణాల పరిష్కార ప్రణాళికకు రుణదాతలు ఆమోదం తెలిపినట్లు అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఇంటర్‌-క్రెడిటార్ ఒప్పందంపై (ఐసీఏ) రుణాలిచ్చిన మొత్తం 16 సంస్థలు సంతకాలు చేసినట్లు పేర్కొంది. ఆర్‌బీఐ కొత్త సర్క్యులర్‌ ప్రకారం రుణగ్రహీత ఏ ఒక్క బ్యాంకుకైనా డిఫాల్ట్ అయిన పక్షంలో 30 రోజుల్లోగా మిగతా రుణదాతలు సదరు ఖాతాను సమీక్షించాల్సి ఉంటుంది. ఈ సమయంలో బ్యాంకులు నిర్దిష్ట పరిష్కార ప్రణాళికను నిర్ణయించి, ఐసీఏ కుదుర్చుకోవాలి. రుణ విలువలో దాదాపు 75 శాతం ఇచ్చిన రుణదాతలు, సంఖ్యాపరంగా 60 శాతం మంది రుణదాతలు .. పరిష్కార ప్రణాళికపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. కన్సార్షియంలో మిగతా రుణదాతలు కూడా ఈ పరిష్కార ప్రణాళికకు కట్టుబడాల్సి ఉంటుంది. వివిధ అసెట్స్‌ను విక్రయించడం, లీజుకివ్వడం తదితర మార్గాల్లో నిధుల సమీకరణ ద్వారా నిర్దేశిత 180 రోజుల డెడ్‌లైన్ లోగానే పరిష్కార ప్రణాళికను అమలు చేయగలమని రిలయన్స్ ఇన్‌ఫ్రా ధీమా వ్యక్తం చేసింది. You may be interested

భూముల అమ్మకంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊపిరి!

Friday 12th July 2019

అమ్మదగిన భూముల గుర్తింపు విలువ రూ.20,000 కోట్లుగా అంచనా న్యూఢిల్లీ: తీవ్ర రుణ భారంతో ఉన్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌, దేశవ్యాప్తంగా తన ఆధీనంలో ఉన్న భూముల విక్రయంపై దృష్టి సారించింది. ఈ భూముల విలువ రూ.20,000 కోట్లు ఉంటుందని అంచనా. విక్రయించాల్సిన భూముల జాబితాను పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి (దీపమ్‌) పంపింది. ఏటేటా ఆదాయాలు పడిపోతూ, నష్టాలు పెరిగిపోతున్న క్లిష్ట పరిస్థితుల్లో... భూములు, మొబైల్‌ టవర్లు, ఫైబర్‌

రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటాం

Friday 12th July 2019

కొన్ని విభాగాల్లో కొత్త సమస్యలు యాక్సిస్‌ బ్యాంకు ఎండీ చౌదరి ముంబై: ఆర్థిక వ్యవస్థలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయని, దీంతో రుణాల పంపిణీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు యాక్సిస్‌ బ్యాంకు ఎండీ అమితాబ్‌ చౌదరి అన్నారు. ఒకవైపు అధిక ఎన్‌పీఏల సమస్య నుంచి బ్యాంకులు బయటపడుతూ, రుణాల జారీ నిదానించిన సమయంలోనే ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ‘‘ఆర్థిక రంగంలో ఏర్పడుతున్న పరిణామాలతో ఒత్తిళ్లకు సంబంధించి కొత్త సంకేతాలు

Most from this category