News


కేజీ డీ6లో కనిష్ట స్థాయికి గ్యాస్

Monday 22nd July 2019
news_main1563779444.png-27225

న్యూఢిల్లీ: గ్యాస్ ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడంతో కేజీ-డీ6 బ్లాక్ ప్రస్తుతం చివరి దశలో ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) వెల్లడించింది. గ్యాస్ ఉత్పత్తికి కావల్సినంత పీడనం లేకపోవడం, బావుల్లో నీరు చొరబడటం తదితర అంశాలు ఉత్పత్తి భారీగా పడిపోవడానికి కారణాలని వివరించింది. అయితే, కేజీ-డీ6 బ్లాక్‌లో పరిస్థితులను మళ్లీ మెరుగుపర్చేందుకు 2020 మధ్య నాటి నుంచి మూడు కొత్త ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభించే ప్రక్రియ చేపడుతున్నట్లు జూన్ క్వార్టర్‌ ఫలితాల వెల్లడి సందర్భంగా ఇన్వెస్టర్లకు తెలిపింది. ఈ మూడింటి నుంచి రోజుకు 30-35 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) మేర గ్యాస్ ఉత్పత్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు ఆర్‌ఐఎల్‌ వివరించింది. ముందుగా ఆర్‌-క్లస్టర్‌ బావుల నుంచి 2020 మధ్య నాటికి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కాగలదని భావిస్తున్నట్లు పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్‌లో 2010 మార్చిలో గరిష్టంగా రోజుకు 69.43 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్ క్వార్టర్‌లో ఇది 1.76 ఎంసీఎండీకి పడిపోయింది.



You may be interested

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 22nd July 2019

ఫెడరల్‌ బ్యాంక్‌        కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ. 99 టార్గెట్‌ ధర: రూ.125 ఎందుకంటే:- ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ పనితీరు నిలకడగానే ఉంది. గత క్యూ4లో రూ.256 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.415 కోట్లకు పెరిగాయి. ఒత్తిడి రిటైల్‌ రుణాలు కేరళలోనే అధికంగా ఉన్నాయి. భారీ వరదల కారణంగా  కేరళలో పరిస్థితులన్నీ తల్లకిందులు కావడమే దీనికి కారణం. రికవరీ త్వరితంగానే ఉండగలదని

పిరమల్‌ రూ.1,500 కోట్ల ఎన్‌సీడీల సమీకరణ

Monday 22nd July 2019

అజయ్ పిరమల్ నియంత్రణలో ఉన్న పిరమల్ ఎంటర్‌ప్రైజస్‌ లిమిటెడ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (ఎన్‌సిడి) ద్వారా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి రూ.1,500 కోట్లు సమీకరించిందని పరిశీలకులు తెలిపారు. పిరమల్‌ గ్రూప్‌కు చెందిన పిరమల్‌ క్యాపిటల్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల కార్యక్రమాల మూలధన అవసరాలను తీర్చడానికి కూడా ఈ మొత్తాన్ని ఉపయోగిచంనున్నామని పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌ తెలిపింది. దీంతోపాటు జనవరి 2020 లో తిరిగి చెల్లించవలసిన  కాల-సంబంధిత రుణ చెల్లింపులకు ఈ మొత్తాన్ని

Most from this category