News


రిలయన్స్‌ రూ.12,900 కోట్ల రుణాలు

Wednesday 26th June 2019
news_main1561535656.png-26589

  • విదేశీ సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు 
  • సీఎస్‌ఆర్‌ నిధులు మళ్లించలేదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ విదేశీ సంస్థల నుంచి రూ.12,900 కోట్ల (185 కోట్ల డాలర్లు) రుణాలు తీసుకుంది. భవిష్యత్తు పెట్టుబడుల ప్రణాళికల నిమిత్తం వివిధ విదేశీ సం‍స్థల నుంచి ఈ రుణాలు తీసుకున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. సాధారణ వ్యాపార అవసరాల కోనం ఆయా సంస్థల నుంచి దీర్ఘకాలిక రుణ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. అయితే రుణాల కాలపరిమితి, వడ్డీరేట్లు తదితర వివరాలను ఈ కంపెనీ వెల్లడించలేదు. రిలయన్స్‌ తాలూకు టెలికం విభాగం జియో భవిష్యత్తు అవసరాల కోసం రూ.20,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఈ రుణాలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధి నుంచి రూ.1,700 కోట్ల నిధులను దారి మళ్లించారన్న అభియోగాలపై కంపెనీ వివరణ ఇచ్చింది. సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు సంబంధించి కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ (ఎమ్‌సీఏ) శాఖ ఎప్పటికప్పుడు తమ నుంచి సమాచారాన్ని కోరుతోందని, ఎమ్‌సీఏ అడిగిన అన్ని వివరాలను అందిస్తున్నామని ఆర్‌ఐఎల్‌ తెలియజేసింది. ఎమ్‌సీఏ ఇటీవలే తమ సీఎస్‌ఆర్‌​ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అదనపు సమాచారాన్ని కోరిందని, ఈ సమాచారాన్ని అందజేసే ప్రక్రియ జరుగుతోందని వివరించింది. కంపెనీ సామాజిక బాధ్యత నిధులను రిలయన్స్‌ దారి మళ్లించిందని, దీనికి సంబంధించి రిలయన్స్‌పై కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రిలయన్స్‌ను స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు వివరణ కోరాయి. 
‘‘సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తాం. ఇతర పేరొందిన ఏజెన్సీల ద్వారా కూడా సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలు నిర్వహిస్తాం. సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలు కోసం భారత్‌లో అధికంగా వ్యయం చేసేది మేమే. ప్రతి ఏడాది సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల వివరాలను వార్షిక నివేదికలో వెల్లడిస్తూనే ఉన్నాం’’ అని ఆర్‌ఐఎల్‌ వివరించింది. 



You may be interested

వచ్చే మూడేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు ఎగుమతులు

Wednesday 26th June 2019

భారత ఎగుమతి సంస్థల సమాఖ్య అంచనా న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం 535 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశీ ఎగుమతులు.. వచ్చే మూడేళ్లలో ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరనున్నాయని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈఓ) అంచనావేసింది. లాజిస్టిక్స్ రంగంలో అభివృద్ధి, మౌళిక సదుపాయాల నిర్మాణం ఎగుమతులకు ఊతం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ‘లాజిస్టిక్స్ (సరుకు రవాణా) రంగం వ్యయ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడం, వ్యాపార

‘సొనాటా’ వెడ్డింగ్‌ కలెక్షన్‌

Wednesday 26th June 2019

హైదరాబాద్‌: వివాహ సీజన్‌ సందర్భంగా నూతన వధూవరుల కోసం ప్రత్యేక వెడ్డింగ్‌ కలెక్షన్‌ను ప్రారంభించినట్లు టైటాన్‌ కంపెనీకి చెందిన ప్రముఖ వాచీల బ్రాండ్‌ ‘సొనాటా’ వెల్లడించింది. హ్యాండ్‌ క్రాఫ్టెడ్‌ డిజైన్లను ఈ కలెక్షన్‌లో భాగంగా అందిస్తోంది. వివాహ సమయంలో వధువులకు సరిగ్గా సరిపడే విధంగా బంగారం, రోజ్‌ గోల్డ్‌ ప్లేటింగ్‌తో నూతన వేరియంట్స్‌ అందుబాటులో ఉండగా... పురుషులు కోసం నాణ్యత, డిజైన్‌ పరంగా ప్రీమియంగా కనిపించే లెదర్‌ స్ట్రాప్స్‌, రోజ్‌

Most from this category