News


కార్మికులకు అండగా రిలయన్స్‌

Tuesday 24th March 2020
news_main1585019807.png-32646

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్మికులకు అండగా నిలిచింది. కరోన వైరస్‌ నేపథ్యంలో పనులు నిలిచినప్పటికీ కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రూ.30,000లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు చేతిలో నగదు ఉండేలా నెలలో రెండుసార్లు వేతనం చెల్లించనుంది. కరోన పాజిటివ్‌ రోగుల చికిత్సకై 100 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని లోధివాలిలో ఐసోలేషన్‌ ఫెసిలిటీ సైతం అందుబాటులోకి తెచ్చింది.‍ ఫేస్‌ మాస్కుల తయారీ సామర్థ్యాన్ని రోజుకు లక్ష యూనిట్లకు పెంచింది. అలాగే సూట్స్‌, గార్మెంట్స్‌ వంటి పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీని పెద్ద ఎత్తున చేపట్టింది. స్వచ్చంద సంస్థల సహకారంతో పలు నగరాల్లో జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజనం అందిస్తోంది. అత్యవసర సర్వీసులు మినహా అత్యధిక మంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేలా ప్రోత్సహించింది.  



You may be interested

కోవిడ్‌ నివారణకు యాక్సిస్‌, వేదాంత చెరో రూ.100 కోట్ల ఫండ్‌

Tuesday 24th March 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ యాక్సిస్‌.. కోవిడ్‌–19 నివారణ చర్యలకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు రూ.100 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్లు, ఉద్యోగులు, వర్తకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎండీ అండ్‌ సీఈఓ అమితాబ్‌ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్‌ వ్యాప్తికి స్వీయ నియంత్రణే అసలైన మందు అని.. అందుకే బాధ్యత గల

వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లు

Tuesday 24th March 2020

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో రానున్న 16 రోజుల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. స్వల్పకాలిక రెపో వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలను వ్యవస్థలోకి పంప్‌ చేయాలని నిర్ణయించింది. రూ.50,000 కోట్లకు మొదటి విడత రెపో వేలం సోమవారం జరిగింది. అయితే ఈ మొదటి రెపో వేలం ద్వారా

Most from this category