News


ఐఓసీని అధిగమించిన రిలయన్స్‌

Tuesday 17th December 2019
news_main1576553712.png-30261

  • ఫార్చ్యూన్‌ ఇండియా- 500లో అగ్రస్థానం
  • 2018-19లో రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయం
  • వృద్ధిలో ఐఓసీ కంటే 8.4 శాతం అధికం

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో ఘనతను సాధించింది. తాజాగా ఫార్చ్యూన్‌ ఇండియా- 500 జాబితాలో అగ్ర స్థానానికి చేరుకుంది. ఆదాయం పరంగా వెలువడిన ఈ జాబితాలో ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను  (ఐఓసీ) వెనక్కు నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు ఫార్చ్యూన్‌ ఇండియా పేర్కొంది. వృద్ధి 41.5 శాతం ఉండగా.. పోటీ సంస్థ ఐఓసీతో పోల్చితే ఈ కంపెనీ వృద్ధి 8.4 శాతం అధికంగా ఉంది. ఐఓసీ అమ్మకాలు రూ.5.36 లక్షల కోట్లు కాగా, వృద్ధి 26.6 శాతం, లాభం రూ.39,588 కోట్లుగా ఉన్నాయి. ఇక గడిచిన 10 ఏళ్ల సగటు పరంగా చూస్తే.. ఈ కాలంలో ఐఓసీ ఆదాయం కంటే ఆర్ఐఎల్ ఆదాయం 3 రెట్లు అధికం. ఒక ఏడాదిలో అత్యధికంగా 4.8 రెట్లు కూడా సాధించింది. 2015 ఆర్థిక సంవత్సరంలో ఐఓసీ రూ. 4,912 కోట్ల లాభాన్ని నమోదుచేయగా.. ఆర్ఐఎల్ రూ. 23,566 కోట్ల లాభాన్ని కళ్లచూసింది. 
ఓఎస్‌జీసీ స్థానం పదిలం...
గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) మూడవ స్థానంలో నిలిచింది. ఎస్‌బీఐ (4), టాటా మోటార్స్‌ (5), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 6 స్థానాల్లో ఉన్నాయి. అంతక్రితం ఏడాదిలో కూడా ఈ కంపెనీల జాబితా ఇదే వరుసలో ఉంది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 2019 జాబితాలో 7వ స్థానానికి చేరుకుంది. టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌), లార్సెన్ అండ్‌ టూబ్రో వరుసగా 8, 9, 10, 11 వ స్థానంలో ఉన్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ రెండు మెట్లు ఎక్కి 12వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుస స్థానాల్లో హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. వేదాంత లిమిటెడ్ మూడు మెట్లు దిగి 18వ స్థానంలో నిలిచింది.
11.8 శాతం పెరిగిన 500 కంపెనీల లాభం
ఫార్చ్యూన్‌ ఇండియా జాబితాలోని 500 కంపెనీల 2019 సగటు ఆదాయం 9.53 శాతం పెరగ్గా, లాభం 11.8 శాతం వృద్ధి చెందింది. నష్టాలు ప్రకటించిన కంపెనీల పరంగా ఈ ఏడాదిలో పురోగతి ఉంది. అంతక్రితం ఏడాది 79 కంపెనీలు రూ. 2 లక్షల కోట్ల నష్టాలను ప్రకటించగా.. ఈ ఏడాది 65 కంపెనీల మొత్తం నష్టం 1.67 లక్షల కోట్లకు తగ్గింది. 



You may be interested

జియో-బీపీ బ్రాండ్‌ పేరుతో పెట్రోల్‌ బంకులు

Tuesday 17th December 2019

న్యూఢిల్లీ: ఇంధన రిటైల్‌ విభాగంలో వ్యాపారం విషయమై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీ సోమవారం ఒప్పందం చేసుకున్నాయి. ఆగస్ట్‌లో చేసుకున్న ఒప్పందానికి కొనసాగింపుగా తప్పనిసరి ఒప్పందానికి వచ్చాయి. 2020 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జాయింట్‌ వెంచర్‌ కార్యరూపం దాల్చవచ్చని అంచనా. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌కు దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిని కూడా జాయింట్‌ వెంచర్‌ కిందకు తీసుకురానున్నారు. మొత్తం 5,500 విక్రయ కేంద్రాలకు విస్తరించాలన్నది లక్ష్యం. జాయింట్‌

వేదాంత రూ.60,000 కోట్ల పెట్టుబడి

Tuesday 17th December 2019

2-3 ఏళ్లలో పెడతామన్న చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ముంబై: వేదాంత కంపెనీ రానున్న 2-3 ఏళ్లలో రూ.60,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. రానున్న 4- 5 ఏళ్లలో 3,000- 4,000 కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇదే కాలానికి 1,000 కోట్ల డాలర్ల నికర లాభం సాధించడం లక్ష్యమని వివరించారు. ఇక్కడ జరిగిన ఇండియా ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌

Most from this category