News


రుణాలన్నీ తీర్చేస్తాం

Wednesday 12th June 2019
news_main1560318332.png-26243

  • భవిష్యత్తుల్లో రుణాలన్నీ తీర్చేస్తాం
  • గ్రూపు రుణభారాన్ని తగ్గించుకుంటాం
  • వదంతుల వల్లే షేర్ల పతనం: అనిల్‌ అంబానీ
  • తీర్పుల్లో జాప్యమూ కారణమేనని ఆరోపణ

న్యూఢిల్లీ/ముంబై: భవిష్యత్తులో అన్ని రకాల రుణ చెల్లింపులను సకాలంలో తీర్చివేసేందుకు కట్టుబడి ఉన్నామని అడాగ్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ ప్రకటించారు. గడిచిన 14 నెలల కాలంలో రూ.35,000 కోట్ల రుణాలను చెల్లించినట్టు చెప్పారు. తమ గ్రూపు రుణ భారాన్ని కనీస స్థాయికి తగ్గించుకోనున్నట్టు తెలియజేశారు. రూ.లక్ష కోట్ల భారీ రుణ భారం అడాగ్‌ గ్రూపునకు ఉండగా, దీన్ని తగ్గించుకునేందుకు పలు వ్యాపారాలను విక్రయించే ప్రయత్నాలను అనిల్‌ అంబానీ ఇటీవలి కాలంలో వేగవంతం చేయడం తెలిసిందే. బిగ్‌ఎఫ్‌ఎం రేడియో వ్యాపారాన్ని దైనిక్‌ జాగరణ్‌కు చెందిన మీడియా బ్రాడ్‌కాస్ట్‌కు విక్రయించేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలో రిలయన్స్‌ క్యాపిటల్‌ వాటాను నిప్పన్‌ లైఫ్‌కు విక్రయించనున్నారు. గ్రూపు కంపెనీలైన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ పవర్‌ షేర్లు వేగంగా పడిపోవడానికి అనవసర వదంతులే కారణమని మీడియాతో కాన్ఫరెన్స్‌ కాల్‌ సందర్భంగా అనిల్‌ స్పష్టం చేశారు. ఆస్తుల విక్రయ ప్రణాళికలు అమల్లో ఉన్నాయని, తద్వారా భవిష్యత్తులో రుణాలను గడువులోపు తీర్చివేస్తామని చెప్పారు. 
గ్రూపును మార్చేస్తాం...
కనీస రుణ భారం, కేవలం కొన్ని ఆస్తులు (క్యాపిటల్‌ లైట్‌), ఈక్విటీపై అధిక రాబడులు కలిగిన గ్రూపుగా అడాగ్‌ను తీర్చిదిద్దుతామని అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. అనవసర వదంతులు, స్పెక్యులేషన్‌ గ్రూపు కంపెనీల షేర్లను గడచిన కొన్ని వారాల్లో తీవ్రంగా నష్టపరిచినట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి అడాగ్‌ గ్రూపు షేర్లు 65 శాతం వరకు పతనం కావడం గమనార్హం. ‘‘ఎన్నో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో, రుణదాతల నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం లేకపోయినప్పటికీ, గ్రూపు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మే చివరి వరకు రూ.24,800 కోట్ల అసలును చెల్లించింది. అలాగే, రూ.10,600 కోట్లను వడ్డీగా చెల్లించాం’’ అని అనిల్‌ అంబానీ తెలిపారు. ఈ చెల్లింపులన్నీ రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, వాటి అనుబంధ సంస్థలవిగా పేర్కొన్నారు. 
తీర్పుల్లో అసాధారణ జాప్యం...
గ్రూపు సమస్యలకు నియంత్రణ సంస్థలు, కోర్టుల వైఖరి కూడా కారణమేనని అనిల్‌ అంబానీ తప్పుబట్టారు. తీర్పుల్లో జాప్యం కారణంగా గ్రూపు రూ.30,000 కోట్లను పొందలేకపోయినట్టు చెప్పారు. ‘‘ఐదు, పదేళ్ల నుంచీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ పవర్‌, వాటి అనుబంధ కంపెనీలకు సంబంధించి రావాల్సిన రూ.30,000 కోట్ల మొత్తంపై నియంత్రణ సంస్థలు, కోర్టులు ఎటువంటి తుది తీర్పులను జారీ చేయలేకపోయాయి’’ అని అంబానీ వివరించారు. ఏదో ఒక కారణంతో తుది తీర్పులన్నవి అసాధారణంగా, మళ్లీ మళ్లీ జాప్యమైనట్టు చెప్పారు. టెలికం స్పెక్ట్రమ్‌, టవర్ల వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా, నియంత్రణపరమైన అడ్డంకులను ఎదుర్కొన్నామని చెప్పారు. ‘‘14 నెలల్లో ఎన్నో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో రూ.35,000 కోట్ల చెల్లింపులు చేశాం. బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా కంపెనీలు, ‍ప్రావిడెంట్‌ ఫండ్స్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీలు తదితర లెండింగ్‌ సంస్థలు ఈ కాలంలో రిలయన్స్‌ గ్రూపునకు ఎటువంటి అదనపు రుణాలను ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తి ఉదాసీనత, సహకార లేమి రుణదాతల ప్రయోజనాలతోపాటు, ఇతర భాగస్వాముల ప్రయోజనాలను సైతం దెబ్బతీశాయి’’ అని అనిల్‌ అంబానీ ఆదేదన వ్యక్తం చేశారు. You may be interested

ఆ నిధిని బ్యాంకులకిస్తే బెటర్‌

Wednesday 12th June 2019

ఆర్‌బీఐ అదనపు నిధులపై బీఆఫ్‌ఏ-ఎంఎల్‌ అభిప్రాయం కేంద్రానికి రూ.3 లక్షల కోట్లు బదలాయించవచ్చని అంచనా ఈ మేరకు జలాన్‌ కమిటీ సిఫారసు ఉంటుందని నివేదిక న్యూఢిల్లీ: భారత్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరత ఇబ్బందుల్లో ఉన్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ- బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిలించ్‌ (బీఆఫ్‌ఏ-ఎంఎల్‌)

ఇండిగో ‘వేసవి ప్రత్యేక ఆఫర్‌’

Wednesday 12th June 2019

రూ.999కే టికెట్‌ న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. ‘స్పెషల్‌ సమ్మర్‌ సేల్‌’ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.999కే టికెట్‌ అందిస్తోంది. జూన్‌ 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుండగా.. జూన్‌ 16 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు జరిగే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణాల ప్రారంభ టికెట్‌ ధర రూ.3,499గా ఉండనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ

Most from this category