News


రిలయన్స్ గ్యాస్ రేటు తగ్గింపు

Monday 11th November 2019
news_main1573442985.png-29489

న్యూఢిల్లీ: కొనుగోలుదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కేజీ-డీ6 బ్లాక్‌లో కొత్తగా ఉత్పత్తి చేయబోయే గ్యాస్ బేస్ ధరను రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 7 శాతం తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ-డీ6 బ్లాక్‌లోని ఆర్‌-క్లస్టర్ క్షేత్రం నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్‌ కొనుగోలు కోసం రిలయన్స్ బిడ్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం.. గడిచిన మూడు నెలల బ్రెంట్ క్రూడ్‌ సగటు రేటులో 9 శాతం స్థాయిలో గ్యాస్‌ బేస్ ధరను నిర్ణయించింది. తాజా మార్పుతో బేస్ రేటు 8.4 శాతం స్థాయిలో ఉండనుంది. 



You may be interested

ఆర్థిక రంగం ముందు సవాళ్లు: సీతారామన్‌

Monday 11th November 2019

న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘ది రైజ్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌: కాజెస్‌, కన్‌సీక్వెన్సెస్‌, క్యూర్‌’ అనే పేరుతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వి.అనంత నాగేశ్వరన్‌, గుల్జార్‌ నటరాజన్‌ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంత్రి ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం, భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం పరిష్కారాలను సూచించినట్టు చెప్పారు. ఓ

మారుతీ సుజుకీ ఉత్పత్తిలో కోత

Monday 11th November 2019

అక్టోబర్‌లో 20.7 శాతం తగ్గింపు న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. అక్టోబర్‌ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించింది. గతనెల్లో 1,19,337 యూనిట్లకే పరిమితమైంది. అంతక్రితం ఏడాది అక్టోబర్‌లో 1,50,497 యూనిట్లను సంస్థ ఉత్పత్తి చేసింది. ఏడాది ప్రాతిపదికన భారీ ఉత్పత్తి కోతను విధించి వరుసగా 9వ నెల్లోనూ అవుట్‌పుట్‌ను తగ్గించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ప్యాసింజర్‌ వాహన

Most from this category