News


మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారానికి అనిల్‌ గుడ్‌బై

Friday 24th May 2019
news_main1558680804.png-25905

  •  ఆర్‌నామ్‌ చేతికి నిప్పన్‌లైఫ్‌
  • రిలయన్స్‌ క్యాపిటల్‌ వాటా విక్రయం
  • ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు
  • పబ్లిక్‌ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ 
  • ఒక్కో షేరుకు రూ.230 ఆఫర్‌

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో (ఆర్‌నామ్‌) రిలయన్స్‌ క్యాపిటల్‌, జపాన్‌కు చెందిన నిప్పన్‌లైఫ్‌కు చెరో 42.88 శాతం వాటా ఉంది. ఆర్‌నామ్‌లో రిలయన్స్‌ క్యాపిటల్‌ తనకున్న వాటాను నిప్పన్‌కు విక్రయించేందుకు తప్పనిసరిగా చేసి తీరాల్సిన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెబీ నిబంధనల మేరకు ఆర్‌నామ్‌ పబ్లిక్‌ షేర్‌ హోల్డర్లకు ఒక్కో షేరు రూ.230 చొప్పున నిప్పన్‌లైఫ్‌ ఓపెన్‌ ఆఫర్‌ను కూడా ఇవ్వనున్నట్టు రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది.
రుణ భారం తగ్గింపు
ఆర్‌నామ్‌లో తన వాటాను విక్రయించడం ద్వారా వచ్చే రూ.6,000 కోట్లతో రిలయన్స్‌ క్యాపిటల్‌ రుణ భారాన్ని 33 శాతం వరకు తగ్గించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘మాకు సుదీర్ఘకాలంగా విలువైన భాగస్వామి అయిన నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆర్‌నామ్‌లో తన వాటాను 75 శాతానికి పెంచుకుంటోంది. ఆర్‌నామ్‌లో వాటా విక్రయం సరైన విలువను సొంతం చేసుకునే విధానంలో భాగమే. ఈ లావాదేవీతోపాటు అమల్లో ఉన్న ఇతర లావాదేవీలు కూడా కలిపితే రిలయన్స్‌ క్యాపిటల్‌ రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 50 శాతం తగ్గిపోతుంది’’ అని అనిల్‌ అంబానీ తెలిపారు. 
ఓపెన్‌ ఆఫర్‌
ఆర్‌నామ్‌లో పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల నుంచి 14.63 శాతం వాటాకు సమానమైన 8.99 కోట్ల షేర్లకు రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.230 చొప్పున మొత్తం రూ.2,068 కోట్లను ఇందుకోసం వినియోగించనుంది. ఆర్‌నామ్‌ నియంత్రణ నిప్పన్‌లైఫ్‌ చేతికి వెళుతుంది. అయితే, వాటా విక్రయం తర్వాత కూడా రిలయన్స్‌ క్యాపిటల్‌కు మైనారిటీ వాటా ఉంటుందని తెలుస్తోంది. దీనికి కారణం ప్రమోటర్ల వాటా గరిష్ట పరిమితి 75 శాతం కావడం గమనార్హం. అనిల్‌ అంబానీ కుమారుడు జై అనుమోల్‌ అంబానీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్‌నామ్‌ కంపెనీ ప్రకటించింది. 



You may be interested

వృద్ధులకు బ్యాంకు వడ్డీపై టీడీఎస్‌ మినహాయింపు

Friday 24th May 2019

రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారికి అమల్లోకి  న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్‌ మినహాయింపు విషయంలో వృద్ధులకు సంతోషాన్నిచ్చే నిర్ణయం వెలువడింది. ఇకపై రూ.5 లక్షల వరకు పన్ను ఆదాయం కలిగిన వృద్ధులు బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్‌) నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికే ఈ అవకాశం ఉంది. 2019-20 మధ్యంత బడ్జెట్‌లో

ఆర్థిక​వృద్ధికి ఊతం

Friday 24th May 2019

స్థిరమైన ప్రభుత్వంతో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఎన్‌డీఏ 2.0తో సాహసోపేత సంస్కరణలు ఎన్నికల ఫలితాలపై పరిశ్రమ వర్గాల అంచనా న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాత్మక సారథ్యానికి ప్రజలు మరోసారి రికార్డు మెజారిటీతో పట్టం కట్టారని భారతీయ పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, విదేశీ పెట్టుబడుల రాకకు ఊతం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఎకానమీని అధిక వృద్ధి బాట పట్టించేందుకు

Most from this category