ఆర్ఎన్ఏఎమ్లో 10.75శాతం వాటాను విక్రయించిన ఆర్‌క్యాప్
By Sakshi

రిలయన్స్ నిప్పాన్ ఎసెట్ మానెజ్మెంట్(ఆర్‌ఎన్‌ఏఎమ్)లో 10.75శాతం వాటాను రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌క్యాప్) సోమవారం రెండు వరుస ఆఫర్లలో విక్రయించింది. వీటి విలువ రూ.1,450కోట్లని సంస్థ సోమవారం ప్రకటించింది. ఆర్క్యాప్కున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, జపాన్‌కు ఈ వాటాను విక్రయించామని వివరించింది. దీంతో ఆర్‌క్యాప్ సంస్థ ఆర్ఎన్ఏఎమ్లో తన మెజార్టీ వాటాను కోల్పోయి 25శాతం వాటాతో మినిమమ్ షేర్ హోల్డర్‌గా మిగిలింది. ఈ లావాదేవినే కాకుండా ఇతర ఆస్థుల నుంచి కూడా డబ్బును సేకరించి ఆర్ క్యాప్ అప్పులను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000కోట్లు లేదా 70 శాతం తగ్గించాలని ప్రయత్నిస్తున్నట్టు సంస్థ వివరించింది.
You may be interested
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు షేర్లే సేఫ్: యూబీఎస్
Monday 17th June 2019ప్రస్తుతం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ షేర్లు గడ్డుకాలం ఎదుర్కోంటున్న తరుణంలో, ఇన్వెస్టర్లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు ఎంపిక మంచిదని విదేశీ బ్రోకింగ్ దిగ్గజం యూబీఎస్ సూచిస్తుంది. వచ్చే 3-4 ఏళ్లలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల లోన్బుక్స్, ఆదాయాలు పరిశ్రమ సగటు వృద్ధి కంటే రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని బ్రోకింగ్ సంస్థ తెలిపింది. రుణ విభాగాల్లో పటిష్టమైన నెట్వర్కింగ్ వ్యవస్థ కలిగి ఉండటంతో పాటు నాన్
3వారాల కనిష్టానికి యాక్సిస్ బ్యాంక్
Monday 17th June 2019యాక్సిస్ బ్యాంక్ షేరు సోమవారం 2.46శాతం నష్టపోయి రూ.781,50 వద్ద ట్రేడవుతోంది. గత నెల 27 తర్వాత ఈ షేరుకి ఇదే కనిష్ఠ స్థాయి. ఏప్రిల్ 27,2018 కనిష్ఠ స్థాయి నుంచి జూన్ 4, 2019 గరిష్ఠ స్థాయి మధ్య గల 7శాతం ఫైబోనాక్కి రిట్రాస్మెంట్ స్థాయి రూ. 803.48 వద్ద ఈ షేరుకు మద్ధతు ఉంది. తాజాగా ఈ మద్దతు కోల్పోయింది. దీంతోపాటు 20రోజుల డీఎంఏ స్థాయి దిగువకు