News


రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం నాలుగింతలు

Friday 16th August 2019
news_main1565933207.png-27802

  • గత క్యూ1లో రూ.295 కోట్ల నికర లాభం 
  • ఈ క్యూ1లో రూ.1,218 కోట్లకు వృద్ది

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.295 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,218 కోట్లకు పెరిగిందని రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.4,641 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.6,083 కోట్లకు ఎగసిందని వివరించింది. ఆస్తులు రూ.83,973 కోట్ల నుంచి రూ.79,207 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ప్రజల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఏమీ సమీకరించలేదని వివరించింది. 

గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,454 కోట్ల నికర నష్టాలు వచ్చాయని రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ కోసం రూ.2,104 కోట్లు కేటాయించడం వల్ల ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌, బీమా, ఫైనాన్స్‌, స్టాక్‌ బ్రోకింగ్‌,  అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌, ప్రొప్రయిటరీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇతర ఆర్థిక సేవలనందిస్తోంది. 



You may be interested

దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని సమీక్ష

Friday 16th August 2019

మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉన్నతాధికారులో భేటీ అన్ని అంశాలపై సమగ్ర చర్చ త్వరలో చర్యలకు అవకాశం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో

అస్తవ్యస్తం.. ఆటో రంగం

Friday 16th August 2019

అమ్మకాలు లేక ఉత్పత్తి తగ్గించుకుంటున్న కంపెనీలు దీంతో ఉద్యోగాల్లో కూడా కోత ఇప్పటికే 3.5 లక్షల ఉద్యోగాలు కట్‌ తాత్కాలిక సిబ్బందికి మరింత కష్టకాలం సేల్స్‌, ఆర్‌అండ్‌డీలో ఉద్యోగాలకు ఎసరు ముంబై: వాహన విక్రయాలు నానాటికి తగ్గిపోతుండటంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోతోంది. జూలైలో అమ్మకాలు దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూలై

Most from this category