News


రుణ భారం తగ్గించుకుంటాం !

Tuesday 1st October 2019
news_main1569896748.png-28638

  • గ్రూప్‌ కంపెనీల ఏజీఎమ్‌ల్లో అనిల్‌ అంబానీ 

ముంబై: దేశంలో అగ్రశ్రేణి ఐదు రక్షణ కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ను నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అనిల్‌ ధీరుబాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. ప్రస్తుతం రిలయన్స్‌ ఇన్‌ఫ్రా రుణభారం రూ.6,000 కోట్లుగా ఉందని, దీనిని తగ్గించుకోనున్నామని సోమవారం ఇక్కడ జరిగిన కంపెనీ ఏజీఎమ్‌లో ఆయన పేర్కొన్నారు. ఇతర గ్రూప్‌ కంపెనీలు-రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీల ఏజీఎమ్‌లు కూడా సోమవారమే జరిగాయి. ముఖ్యాంశాలు...

  • లెండింగ్‌ బిజినెస్‌ నుంచి వైదొలుగుతున్నామని రిలయన్స్‌ క్యాపిటల్‌ ఏజీఎమ్‌లో అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. 
  • సౌర, పవన, బయెమాస్‌, బయోగ్యాస్‌ వంటి నవీకరణ విద్యుదుత్పత్తి చేసే ఫ్యూచర్‌ గ్రీన్‌ కంపెనీగా రిలయన్స్‌ పవర్‌ అవతరిస్తుందని అనిల్‌ అంబానీ తెలిపారు. 
  • దివాలా ప్రక్రియ నడుస్తున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఏజీఎమ్‌కు రిజల్యూషన్‌​‍ ప్రొఫెషనల్‌ అధ్యక్షత వహించడం విశేషం.  



You may be interested

పీఎంసీ వ్యవహారం కళ్లు తెరిపించేది...

Tuesday 1st October 2019

కేంద్ర సహాయ మంత్రి అనురాగ్‌ఠాకూర్‌ న్యూఢిల్లీ: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు సంక్షోభం కళ్లు తెరిపించేదిగా అభివర్ణించారు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌. ఆడిటర్ల వైఫ్యలం సహా పలు అంశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పీఎంసీ బ్యాంకులో నిబంధనల ఉల్లంఘన, అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకుపై ఆర్‌బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలు పెట్టిన విషయం విదితమే. ‘‘నియంత్రణ సంస్థల పాత్ర ఎంతో కీలకం. అదే

ఆర్థిక రంగం... అంతా నిరాశే!

Tuesday 1st October 2019

ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్‌... ద్రవ్యలోటు... రూపాయి... విదేశీ రుణ భారం... ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి సోమవారం వెలువడిన లెక్కలన్నీ ఆర్థిక విశ్లేషకులకు నిరాశ కలిగిస్తున్నాయి. ఆయా అంశాలను పరిశీలిస్తే... ద్రవ్యలోటు... 5 నెలల్లోనే భయాలు..! ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు ఆగస్టు ముగిసే నాటికే 5,53,840 కోట్లకు చేరింది. 2019-2020 మొత్తంలో బడ్జెట్‌ నిర్దేశించుకున్న పరిమాణంలో ఇప్పటికే 78 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద

Most from this category