News


కేజీ-డీ6 బ్లాక్‌ నుంచి నిష్క్రమించిన నికో

Tuesday 31st December 2019
news_main1577767468.png-30552

  • ఈ కంపెనీ వాటాను టేకోవర్‌ చేసిన రిలయన్స్‌, బీపీలు 

న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌ నుంచి  కెనడాకు చెందిన నికో రీసోర్సెస్‌ వైదొలిగింది. ఈ బ్లాక్‌లో ఈ కంపెనీకి ఉన్న 10 శాతం వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీలు టేకోవర్‌ చేశాయి. ఈ వాటా టేకోవర్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీలు 3.6 కోట్ల డాలర్లు చెల్లించాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీలతో నికో రీసోర్సెస్‌ పరోక్ష అనుబంధ సంస్థ, నెకో లిమిటెడ్‌ ఒక సెటిల్మెంట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాగా ​ఈ డీల్‌ అనంతరం కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటా 60 శాతం నుంచి 66.67 శాతానికి, బీపీ వాటా 30 శాతం నుంచి 33.33 శాతానికి పెరిగాయి. 


కేజీ-డీ6 బ్లాక్‌లో నికో రీసోర్సెస్‌కు 10 శాతం వాటా ఉంది. రుణ దాతలకు బకాయిలు చెల్లించడంతో ఈ కంపెనీ విఫలమైంది. దీంతో ఈ వాటాను విక్రయానికి పెట్టింది. ఈ విక్రయానికి సరైన స్పందన లభించలేదు. మరోవైపు ఈ చమురు క్షేత్రం అభివృద్ధికి అవసరమైన తన వాటా నిధులను అందించలేకపోయింది. దీంతో నికో కంపెనీకి వ్యతిరేకంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఈ బ్లాక్‌ ఆపరేటర్‌గా) డీఫాల్ట్‌ నోటీస్‌ను జారీ చేసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో తన 10 శాతం వాటాను ఆ రెండు కంపెనీలకు విక్రయించి నికో రీసోర్సెస్‌ కేజీ-డీ6 నుంచి వైదొలిగింది. You may be interested

చాలెట్‌ హోటల్స్‌ దూకుడు

Tuesday 31st December 2019

ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ఇటీవల రికార్డుల ర్యాలీ చేసిన పలు మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇండెక్సులు డీలా పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. మంగళవారం ట్రేడింగ్‌లో వార్తల ఆధారంగా చాలెట్‌ హోటల్స్‌, కల్పతరు పవర్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. చాలెట్‌ హోటల్స్‌ ఆతిథ్య రంగ గ్లోబల్‌ కంపెనీ

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాలొచ్చాయ్‌

Tuesday 31st December 2019

రూ. 1,700 కోట్ల పాత బకాయిలు చెల్లింపు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.. విక్రేతలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పాత బకాయిలను చెల్లించినట్లు సోమవారం ప్రకటించింది. వీరికి చెల్లించాల్సిన రూ. 1,700 కోట్ల మొత్తాన్ని ఇచ్చేసినట్లు సంస్థ చైర్మన్ పి.కె. పుర్వార్ వెల్లడించారు. ఈ మొత్తంతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన నవంబర్‌ జీతాలు (రూ. 800 కోట్లు) విడుదలచేసినట్లు చెప్పారు. ఇక తాజా సర్ధుబాట్లు అనంతరం రుణదాతలకు రూ. 10,000

Most from this category