News


ఆటోమొబైల్‌లో నియామకాల రికవరీ

Friday 10th January 2020
news_main1578626501.png-30810

- నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌
- డిసెంబర్‌లో 8 శాతం వృద్ధి
- టైమ్స్‌జాబ్స్‌ రిక్రూట్‌ఎక్స్‌ నివేదిక

న్యూఢిల్లీ: డిమాండ్ మందగమనంతో గతేడాది కుదేలైన ఆటోమొబైల్ రంగం మళ్లీ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తయారీ, విక్రయం, క్వాలిటీ కంట్రోల్‌ వంటి వివిధ విభాగాల్లో నియామకాలు పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని  టైమ్స్‌జాబ్స్‌ రిక్రూట్‌ఎక్స్‌ ఒక నివేదికలో వెల్లడించింది. ఆటోమొబైల్ రంగంలో గతేడాది నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో నిపుణులకు డిమాండ్‌ 8 శాతం పెరిగిందని వివరించింది. "నియామకాల సెంటిమెంట్‌ బట్టి చూస్తే వివిధ రంగాలు రికవరీ బాటలో ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆటోమొబైల్ రంగమే ఇందుకు నిదర్శనం.  కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ఈ రంగం పెను మార్పులకు లోనవుతోంది. ఇందుకు తగ్గట్లుగా సిబ్బందిని కూడా తీసుకునే సన్నాహాల్లో ఉంది" అని టైమ్స్‌జాబ్స్‌ బిజినెస్ హెడ్ సంజయ్‌ గోయల్ తెలిపారు. గత నెల ఆటోమొబైల్ రంగ కంపెనీల్లో.. ప్రధానంగా కొత్త ఉత్పత్తుల పరిశోధన.. అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) నిపుణులు, విక్రయ విభాగం సిబ్బంది ప్రొఫైల్స్‌కు అత్యధికంగా డిమాండ్ కనిపించినట్లు ఆయన చెప్పారు. దేశీయంగా కంపెనీల్లో ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌, ఉద్యోగార్థుల లభ్యతకు కొలమానమైన రిక్రూట్‌ఎక్స్‌ సూచీని టైమ్స్‌జాబ్స్‌ నిర్వహిస్తోంది. 

ఇన్‌ఫ్రా రంగంలో గరిష్టంగా డిమాండ్‌..
గత నెల మౌలిక సదుపాయాల రంగంలో నిపుణుల కోసం అత్యధికంగా డిమాండ్‌ కనిపించింది. 14 శాతం వృద్ధి నమోదైంది. కంటెంట్‌ రైటర్లు, ఎడిటర్లు, జర్నలిస్టుల ప్రొఫైల్స్‌ విభాగం 12 శాతం వృద్ధి కనపర్చింది. భౌగోళికంగా చూస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లో నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అహ్మదాబాద్‌లో గరిష్టంగా 10 శాతం, చండీగఢ్‌లో 9 శాతం వృద్ధి నమోదైంది. ఫ్రెషర్స్‌, రెండేళ్ల లోపు, 2-5ఏళ్ల అనుభవం ఉన్నవారికి గణనీయంగా డిమాండ్ ఉన్నట్లు గోయల్ తెలిపారు. 
 



You may be interested

ఫ్లాట్‌ ఓపెనింగ్‌?!

Friday 10th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 6 పాయింట్లు వీక్‌ గురువారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌ నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి ఉదయం  8.40 ప్రాంతం‍లో 6 పాయింట్లు తక్కువగా 12,265 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,271 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాన్‌- అమెరికా

శామ్‌సంగ్‌ నుంచి అత్యాధునిక ఏసీలు

Friday 10th January 2020

దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సింగ్‌ ఎలక్ట్రానిక్స్‌ గురువారం భారత మార్కెట్లో 40 సిర్‌ కండీషనింగ్‌ ఏసీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో వైండ్‌ఫ్రీ ఏసీ 2.0 కూడా ఉంది. గదిలో గంటకు పైగా వ్యక్తులు ఎవరూ లేకపోతే సెన్సార్‌ గుర్తించి విద్యుత్‌ పొదుపు మోడ్‌లోకి ఏసీని మార్చేస్తుంది. ఈ ఏసీల్లోని ప్రత్యేకతల్లో ఇదీ ఒకటి. అలాగే, ప్రీమియం ట్రిపుల్‌ ఇన్వర్టర్‌ సిరీస్‌ ఏసీలు, ఎకో ఇన్వర్టర్‌, ఆన్‌/ఆఫ్‌ ఏసీలు, విండో

Most from this category