News


ఆర్‌ఈసీ లాభం 24 శాతం డౌన్‌

Wednesday 6th November 2019
news_main1573012922.png-29387

  • రూ.7,484 కోట్లకు ఆదాయం 
  • 3 లక్షల కోట్లు దాటిన లోన్‌బుక్‌ 

న్యూఢిల్లీ:- ప్రభుత్వ రంగ ఆర్‌ఈసీ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 24 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,733 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,322 కోట్లకు తగ్గిందని ఆర్‌ఈసీ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,246 కోట్ల నుంచి రూ.7,484 కోట్లకు పెరిగిందని పేర్కొంది. విద్యుత్‌ రంగంలో సెంటిమెంట్స్‌ మెరుగుపడుతున్నాయని కంపెనీ సీఎమ్‌డీ అజిత్‌ కుమార్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం..., 

ఆర్డర్‌ బుక్‌ 17 శాతం అప్‌...
ఆర్డర్‌ బుక్‌ రూ.3 లక్షల కోట్లను దాటింది. గత క్యూ2 నాటికి రూ.2.57 లక్షల కోట్లుగా ఉన్న లోన్‌బుక్‌ ఈ క్యూ2లో 17 శాతం వృద్ధితో రూ.3.01 లక్షల కోట్లకు పెరిగింది. రూ.300 కోట్ల కేటాయింపులు కారణంగా ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 49.40 శాతానికి పెరిగింది. నికర మొండి బకాయిలు 3.72 శాతం నుంచి 3.47 శాతానికి తగ్గాయి. 
పుష్కలంగా నిధులు...
ఈ క్యూ2లో కంపెనీ ఇంట్రెస్ట్‌ కవరేజ్‌ రేషియో 1.42గా నమోదైంది. షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) రూ.6.62కు పెరిగింది. పుస్తక విలువ రూ.187గా, కంపెనీ నెట్‌వర్త్‌ రూ.36,837 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ2లో 16.14 శాతంగా ఉన్న క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో ఈ క్యూ2లో 17.70 శాతానికి పెరిగింది. భవిష్యత్తు వృద్ధికి ఊతమిచ్చేలా తగిన స్థాయిలోనే నిధులు పుష్కలంగా ఉన్నాయని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. 
 



You may be interested

జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.399 కోట్లు

Wednesday 6th November 2019

రూ.8,940 కోట్లకు తగ్గిన ఆదాయం  న్యూఢిల్లీ: జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌(జేఎస్‌పీఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.399 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.279 కోట్ల నికర లాభం వచ్చిందని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,983 కోట్ల నుంచి రూ.8,940 కోట్లకు తగ్గిందని పేర్కొంది.  ధరలు, లాభదాయకత బాగా తగ్గినా, రెయిల్స్‌, ప్లేట్స్‌ వంటి విభిన్నమైన

టైటాన్‌ లాభం రూ.312 కోట్లు

Wednesday 6th November 2019

రూ. 50,000 వరకు అనుమతి ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎంసీ) డిపాజిటర్లకు మరింత ఊరట లభించింది. ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదున ఉపసంహరణ పరిమితి రూ. 50,000 వరకు పెంచినట్లు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. అంతక్రితం ఈ పరిమితి రూ. 40,000గా ఉండగా.. తాజాగా మరో రూ. 10,000 పరిమితి పెంచింది. రుణాల విషయంలో బ్యాంక్‌ యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందని తేలిన నేపథ్యంలో ఆ బ్యాంక్‌పై

Most from this category