News


టెక్నాలజీతోనే నిర్మాణ వ్యయం తగ్గుతుంది

Thursday 19th December 2019
news_main1576730436.png-30307

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ, డేటా అనలిటిక్ట్స్‌ వినియోగంతో నిర్మాణ, మార్కెటింగ్‌ వ్యయం తగ్గుతుందని నిర్మాణ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు. సీఐఐ–సీబీఆర్‌ఈ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరిగిన ‘ఛేంజింగ్‌ డైనమిక్స్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ’ సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏటీఎస్‌ గ్రూప్‌ సీఎండీ గీతాంబర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో డెవలపర్లు తమ ఆలోచన తీరును మార్చుకోవాలన్నారు. డేటా అనలిటిక్స్‌ వినియోగంతో మార్కెటింగ్‌ వ్యయం చాలా వరకు తగ్గుతుందన్నారు. 

‘‘గతంలో మా కంపెనీలో ప్రాజెక్ట్‌ వ్యయంలో మార్కెటింగ్‌ వ్యయం 4–5 శాతంగా ఉండేది. కానీ, ఇప్పుడు డేటా అనలిటిక్స్‌ వినియోగంతో ఇది కేవలం 1 శాతానికి పరిమితమైందని’’ అని చెప్పారాయన. నిర్మాణ రంగంలో టెక్నాలజీని వాడితే స్టీల్, సిమెంట్‌ వృథా కాకుండా ఉంటుందన్నారు. అనంతరం సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్‌ అండ్‌ సీఈఓ అన్షుమన్‌ మేగజైన్‌ మాట్లాడుతూ.. డెవలపర్లు ప్రాజెక్ట్‌లు ప్రారంభించే ముందు స్థానిక మార్కెట్‌ పరిస్థితులు, కొనుగోలుదారులు ఆర్థిక స్థితిని అవగాహన చేయాలని సూచించారు. కొనుగోలుదారుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఫ్లాట్ల విస్తీర్ణాలను, ధరలను నిర్ణయించాల్సిన డెవలపర్లు.. అలా చేయడం లేదని పేర్కొన్నారు. You may be interested

పతంజలి ఆయుర్వేద చేతికి రుచి సోయా

Thursday 19th December 2019

పూర్తయిన లావాదేవీ న్యూఢిల్లీ: రుచి సోయా కంపెనీ కొనుగోలు ప్రక్రియను పతంజలి ఆయుర్వేద పూర్తి చేసింది. కేసు పరిష్కార ప్రణాళికలో భాగం గా రుణ దాతల కోసం పతంజలి ఆయుర్వేద రూ.4,350 కోట్లను ఎస్క్రో అకౌంట్‌లో డిపాజిట్‌ చేయడంతో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. రుచి సోయాకు రుణాలిచ్చిన రుణదాతలకు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇప్పటి నుంచి రుచి సోయా తమ గ్రూప్‌ కంపెనీ అని పతంజలి ఆయుర్వేద ప్రతినిధి ఎస్‌.కె.

బీఎస్‌ఈ బాండ్స్‌ వేదికపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సీపీ

Thursday 19th December 2019

మరో నాలుగు కంపెనీల కమర్షియల్‌ పేపర్స్‌ కూడా న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ తన కమర్షియల్‌ పేపర్స్‌ను (సీపీ) బీఎస్‌ఈ బాండ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేయాలని బీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీతో పాటు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా మనీ, ఫుల్లర్టన్‌ ఇండియా క్రెడిట్‌.. మొత్తం  ఐదు కంపెనీలు సీపీ లిస్టింగ్‌ కోసం దరఖాస్తు చేశాయి. గురువారం ఈ కంపెనీల కమర్షియల్‌ పేపర్స్‌ను లిస్ట్‌ చేస్తామని బీఎస్‌ఈ

Most from this category