News


రుణాల విభాగంలోకి రియల్‌మీ

Thursday 12th December 2019
news_main1576123275.png-30185

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చైనాలోని షెన్‌జెన్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ... డిజిటల్‌ రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెలాఖరు నుంచి మన దేశంలో రుణ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి వచ్చే వారం న్యూఢిల్లీలో ఒక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంక్‌లు, ప్రైవేట్‌ ఆర్థిక సంస్థలతో ఈ మేరకు సంస్థ ఒప్పందం చేసుకుంది. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌కు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. రూ.లక్ష వరకు రుణాన్ని 5 నిమిషాల్లో మంజూరు చేయడం దీని ప్రత్యేకత. ఇటీవలే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ షావోమీ.. ఎంఐ క్రెడిట్‌ పేరిట డిజిటల్‌ లెండింగ్‌లోకి ప్రవేశించడం తెలిసిందే.
స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో 14.3 శాతం వాటా..
గతేడాది మేలో దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రియల్‌మీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మన దేశంతో పాటూ చైనా, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్‌ వంటి 20 దేశాల్లో ఉంది. ఈ ఏడాది నవంబర్‌ నాటికి దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రియల్‌మీకి 14.3 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 



You may be interested

నిఫ్టీలో కాల్‌ లాడర్‌ వ్యూహం!

Thursday 12th December 2019

మార్కెట్లు బుధవారం చివరిలో పాజిటివ్‌ మూడ్‌లోకి మారాయి. దీంతో ఈ నెల్లో మరోమారు నిఫ్టీ తన ఆల్‌టైమ్‌ హైని తాకొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి స్వల్పశ్రేణి అప్‌మూవ్‌ కదలికల సమయంలో బుల్‌కాల్‌ లాడర్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించాలని డెరివేటివ్స్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యూహంలో 11900 కాల్‌ను కొని 12100, 12200 కాల్స్‌ను(డిసెంబర్‌  నెల ఆప్షన్స్‌) విక్రయించడం జరుగుతుంది. బుధవారం ధరల ప్రకారం చూస్తే 11900 కాల్‌కు రూ. 138రూపాయలు

ఖతార్‌ సావరిన్‌ ఫండ్‌కు అదానీ ఎలక్ట్రిసిటీలో వాటా

Thursday 12th December 2019

డీల్‌ విలువ రూ.3,200 కోట్లు  న్యూఢిల్లీ: అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లో 25.1 శాతం వాటాను ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ(క్యూఐఏ) కొనుగోలు చేయనున్నది. ఈ డీల్‌ విలువ రూ.3,200 కోట్లు. ఈ మేరకు ఖతార్‌కు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌, ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ ట్రాన్సిమిషన్‌ తెలిపింది. అదానీ ట్రాన్సిమిషన్‌ కంపెనీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై సంస్థ(ఏఈఎమ్‌ఎల్‌), ముంబైలో 400

Most from this category