News


ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ

Wednesday 18th December 2019
news_main1576640678.png-30279

  • పైసా యాప్‌ ఆవిష్కరణ
  • రూ. 1 లక్ష దాకా వ్యక్తిగత రుణాలు,
  • ఉచిత క్రెడిట్ రిపోర్ట్‌లు తదితర సర్వీసులు

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా ఆర్థిక సేవల విభాగంలోకి ప్రవేశించింది. రుణాలు, మ్యూచువల్ ఫండ్స్‌, క్రెడిట్ స్కోర్ రిపోర్టులు అందించేందుకు 'రియల్‌మీ పైసా' పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాం ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో ప్రత్యర్థి సంస్థ షావోమీ ఇటీవలే 'మి క్రెడిట్' పేరుతో ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీసులే ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్‌మీ పైసా బీటా యాప్‌ ద్వారా డిజిటల్ వ్యక్తిగత రుణాలు సుమారు రూ. 1 లక్ష దాకా, చిన్న.. మధ్యతరహా సంస్థలు  రూ. 5 లక్షల దాకా రుణాలు పొందవచ్చు. తక్షణ ఉచిత క్రెడిట్ రిపోర్టులు, మూడు నెలల పాటు ఉచిత అప్‌డేట్స్‌, పాత.. కొత్త ఫోన్లకు స్క్రీన్ డేమేజ్‌ బీమా సర్వీసులు ఈ యాప్ ద్వారా రియల్‌మీ అందించనుంది. 2020లో ఈ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 1,000 కోట్ల దాకా రుణ వితరణ, 30-50 లక్షల మంది కొత్త కస్టమర్లకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రియల్‌మీ పైసా లీడ్ వరుణ్ శ్రీధర్ తెలిపారు. ఇందుకోసం ఎర్లీశాలరీ (డిజిటల్‌ వ్యక్తిగత రుణాలకు), లెండింగ్‌ కార్ట్‌ (బిజినెస్ రుణాలకు), క్రెడిట్ మంత్రి (ఉచిత క్రెడిట్ రిపోర్టులకు) వంటి సంస్థలతో రియల్‌మీ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. రీసెర్చి సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో.. దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్‌మీ వాటా 14.3 శాతంగాను, షావోమీ వాటా 27.1 శాతంగా ఉంది. 

మూడేళ్లలో బ్రేక్‌ఈవెన్‌...
"ఏడాదిన్నర వ్యవధిలో మా సంస్థ గణనీయంగా వృద్ధి చెందింది. ఆర్థిక సేవల విభాగం కూడా అలాగే రాణించగలదన్న ధీమా ఉంది. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాథమిక స్థాయిలో ఆటంకాలను తొలగించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. రుణాలు, చెల్లింపులు, పొదుపు, బీమా అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో సేవలు అందించాలన్నది మా లక్ష్యం. రెండున్నర.. మూడేళ్లలో బ్రేక్ ఈవెన్ సాధించగలమని అంచనా వేస్తున్నాం" అని రియల్‌మీ పైసా లీడ్‌ వరుణ్ శ్రీధర్‌ తెలిపారు. వచ్చే మూడేళ్లలో సుమారు 2.5 - 3 కోట్ల మంది వినియోగదారులకు చేరువ కాగలమని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న రియల్‌మీ పైసా యాప్‌ .. గూగుల్‌ ప్లేస్టోర్‌తో పాటు రియల్‌మీ యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంటుంిద. వచ్చే 6-12 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు శ్రీధర్ తెలిపారు. You may be interested

కోటక్‌ ఖాతాలో యస్‌ బ్యాంక్‌ !

Wednesday 18th December 2019

యస్‌ బ్యాంక్‌ విలీనం   కోటక్‌ బ్యాంకే కరెక్టన్న ఎస్‌బీఐ అధిపతి  ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌  విలీన వ్యాఖ్యలను కొట్టిపారేసిన కోటక్‌, యస్‌బ్యాంక్‌లు  ముంబై: యస్‌బ్యాంక్‌ను విలీనం చేసుకోవడానికి కోటక్‌ మహీంద్రా బ్యాంకే కరెక్టని ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌లు  అభిప్రాయపడ్డారు. అయితే విలీన ప్రయత్నాలు అసలే లేవని యస్‌బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు స్పష్టం చేశాయి.  కోటక్‌కే ఆ సత్తా... యస్‌బ్యాంక్‌ను కొనుగోలు చేయగల సత్తా ఉదయ్‌ కోటక్‌కే ఉందని ఎస్‌బీఐ

ఇక చౌక కాల్స్‌, డేటాకు చెల్లు!!

Wednesday 18th December 2019

కనీస చార్జీల విధింపుపై ట్రాయ్ చర్చాపత్రం అనుసరించాల్సిన విధానంపై అభిప్రాయ సేకరణ అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 17 దాకా గడువు న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్స్‌, డేటా విధానానికి స్వస్తి పలుకుతూ .. కనీస చార్జీలు వడ్డించే ప్రతిపాదనలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి సారించింది. దీనిపై తాజాగా చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇటు టెల్కోలు, అటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టారిఫ్‌ల విషయంలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరంపైనా,

Most from this category