అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ
By Sakshi

న్యూఢిల్లీ: దివాలా స్మృతి కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) డైరెక్టర్‌గా అనిల్ అంబానీ రాజీనామా చేయడాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల రాజీనామాలను కూడా తోసిపుచ్చింది. నవంబర్ 20న జరిగిన సమావేశంలో సీవోసీ ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆర్‌కామ్ డైరెక్టర్లుగా కొనసాగాలని, దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి పరిష్కార నిపుణునికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని సీవోసీ సూచించినట్లు వివరించింది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ పిటీషన్ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఆర్కామ్పై దివాలా ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల క్లెయిమ్ ప్రకారం ఆర్‌కామ్ దాదాపు రూ. 49,000 కోట్లు బాకీ పడింది. దీంతో పాటు ఇటీవల లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలకు సంబంధించి కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులివ్వడంతో ప్రభుత్వానికి రూ. 23,327 కోట్లు లైసెన్సు ఫీజు కింద, రూ. 4,987 కోట్లు స్పెక్ట్రం చార్జీల కింద కట్టాల్సి ఉంది. ఈ పరిణామాలతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్‌కామ్ రికార్డు స్థాయిలో రూ. 30,142 కోట్ల నష్టం ప్రకటించింది.
You may be interested
మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అరబిందో
Monday 25th November 2019హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అవతరించనుంది. సాండోజ్ డీల్‌తో కంపెనీపై రుణ భారం పెరిగింది. నోవార్టిస్ కంపెనీ అయిన సాండోజ్ వాణిజ్య కార్యకలాపాలు, మూడు తయారీ ప్లాంట్లను అరబిందో ఫార్మా రూ.6,300 కోట్లు వెచ్చించి గతేడాది సెప్టెంబరులో కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,050-1,400 కోట్లు తగ్గుతుందని అరబిందో సీఎఫ్‌వో సంతానం సుబ్రమణియన్ తెలిపారు. గత మూడు
ఈ వారం స్టాక్ రికమెండేషన్లు
Monday 25th November 2019జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ కొనచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: 358 టార్గెట్ ధర: రూ.443 ఎందుకంటే: భారత్‌లోని పెద్ద మీడియా కంపెనీల్లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీఈఈఎల్) ఒకటి. జీ టీవీ చానెళ్లను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో 16.5 శాతం వాటాను ప్రమోటర్ సంస్థ ఎస్సెల్ గ్రూప్ విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా విక్రయం కారణంగా రూ.4,560 కోట్లు లభిస్తాయని అంచనా. ఈ నిధులను తనఖా షేర్లను