News


ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 69 శాతం డౌన్‌

Thursday 23rd January 2020
news_main1579748120.png-31112

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో భారీగా పతనమైంది. గత క్యూ3లో రూ.225 కోట్లుగా ఉన్న ఈ బ్యాంక్‌ నికర లాభం ఈ క్యూ3లో 69 శాతం పతనమై రూ.70 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు కూడా బాగా పెరిగాయని, అందుకే నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది. 
నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్‌...
గత క్యూ3లో రూ.655 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ3లో 41 శాతం వృద్ధితో రూ.923 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 1.38 శాతం నుంచి 3.33 శాతానికి పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు 0.72 శాతం నుంచి 2.07 శాతానికి ఎగిశాయి. మొండి బకాయిలు భారీగా పెరగడంతో కేటాయింపులు రూ.161 కోట్ల​ నుంచి రూ.638 కోట్లకు చేరాయి. అయితే నికర వడ్డీ మార్జిన్‌ 4.12 శాతం నుంచి 4.57 శాతానికి పెరిగింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ అహుజాను మళ్లీ నియమించామని, వచ్చే నెల 21 నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని బ్యాంక్‌ వెల్లడించింది. You may be interested

పన్ను మినహాయింపులు పొడిగించాలి

Thursday 23rd January 2020

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో భారీగా పతనమైంది. గత క్యూ3లో రూ.225 కోట్లుగా ఉన్న ఈ బ్యాంక్‌ నికర లాభం ఈ క్యూ3లో 69 శాతం పతనమై రూ.70 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు కూడా బాగా పెరిగాయని, అందుకే నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది.  నికర వడ్డీ

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.1,757 కోట్లు

Thursday 23rd January 2020

5 శాతం వృద్ధి  రూ.19,495 కోట్లకు మొత్తం ఆదాయం ముంబై: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికంలో రూ.1,757 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.1,681 కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.18,130 కోట్ల నుంచి రూ.19,495 కోట్లకు పెరిగింది. పెరిగిన తాజా మొండి బకాయిలు... ఈ

Most from this category