News


ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 36 శాతం అప్‌

Wednesday 24th October 2018
news_main1540360408.png-21426

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 36 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.151 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.205 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ఆదాయం బాగా  పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని వివరించింది. అయితే కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల లాభం తగ్గిందని వివరించింది. నిర్వహణ లాభం 48 శాతం వృద్ధితో రూ.449 కోట్లకు పెరిగిందని, కీలకమైన ఫీజు ఆదాయం 60 శాతం వృద్ధితో రూ.325 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్‌...
నికర వడ్డీ ఆదాయం 41 శాతం వృద్ధితో రూ.593 కోట్లకు, ఇతర ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.333 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్‌ 3.74 శాతం నుంచి 4.08 శాతానికి పెరిగిందని వెల్లడించింది. రుణ నాణ్యత ఒకింత మెరుగుపడిందని వివరించింది. గత క్యూ2లో 1.44 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 1.40 శాతానికి, నికర మొండి బకాయిలు 0.78 శాతం నుంచి 0.74 శాతానికి తగ్గాయని తెలిపింది.  కేటాయింపులు 87 శాతం వృద్ధితో రూ.140 కోట్లకు పెరిగాయని పేర్కొంది. 
ఏడాది కనిష్టానికి షేర్‌...
రుణాలు రూ.33,576 కోట్ల నుంచి 37 శాతం వృద్ధితో రూ.45,873 కోట్లకు పెరిగాయని బ్యాంక్‌  పేర్కొంది. డిపాజిట్లు 31 శాతం వృద్ధితో రూ.47,791 కోట్లకు చేరాయని తెలిపింది. అన్ని సెగ్మెంట్లలో మంచి వృద్ధి సాధించామని తెలిపింది. క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 13.12 శాతంగా, టైర్‌-1 క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 11.84 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఈ రెండు నిష్పత్తులు ఆర్‌బీఐ నిర్దేశించిన స్థాయిల కంటే అధికంగానే ఉన్నాయని వివరించింది. ఆర్థిక ఫలితాలు బాగానే ఉన్నా, ఈ షేర్‌ నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్‌ 1 శాతం నష్టంతో రూ.465 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి, రూ.439ను తాకింది. 


 



You may be interested

హెచ్‌-1బీ వీసాల టాప్‌ 10లో టీసీఎస్‌

Wednesday 24th October 2018

వాషింగ్టన్‌: అమెరికా హెచ్‌-1బీ వీసాలకు సంబంధించి ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ పొందిన టాప్ 10 కంపెనీల్లో దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) చోటు దక్కించుకుంది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన 2018 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ మొత్తం 20,755 హెచ్‌-1బీ లేబర్ సర్టిఫికేషన్స్ పొందింది. 1,51,164 సర్టిఫికేషన్స్‌తో ప్రొఫెషనల్ సర్వీసెస్ దిగ్గజం ఎర్న్‌స్ట్‌ అండ్ యంగ్ అగ్ర స్థానంలో ఉన్నట్లు అమెరికా కార్మిక శాఖ ఒక నివేదికలో

బ్యాంకింగ్ సంక్షోభంలో ఆర్‌బీఐ పాత్రేంటి?

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: పేరుకుపోయిన మొండిబాకీలతో బ్యాంకింగ్ రంగం పెను సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో నియంత్రణ సంస్థగా రిజర్వ్ బ్యాంక్ బాధ్యతలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌) రాజీవ్ మహర్షి పలు ప్రశ్నలు లేవనెత్తారు. బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలు ఇచ్చేస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అంతిమంగా ఈ రుణాలే మొండిబాకీలుగా మారి బ్యాంకింగ్ రంగంలో సమస్యలకు దారి తీశాయని పేర్కొన్నారు. "బ్యాంకింగ్ రంగం ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు సంబంధించి

Most from this category