News


వడ్డీరేట్లు మరింత దిగివచ్చే చాన్స్‌!

Saturday 17th August 2019
news_main1566018565.png-27827

  • అంతర్జాతీయ రేటింగ్‌ 
  • దిగ్గజం ఫిచ్‌ విశ్లేషణ
  • మార్చి నాటికి 40 బేసిస్‌ పాయింట్ల 
  • రెపో కోత అంచనా

న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు మరింత దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 మార్చి) ముగిసే నాటికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును మరో 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించే అవకాశం ఉందని  విశ్లేషించింది. ఇప్పటి వరకూ ఆర్‌బీఐ తీసుకున్న పరపతి విధాన సరళీకరణ చర్యలు ఆర్థిక వృద్ధికి తగిన విధంగా దోహదపడలేదని విశ్లేషించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. గడచిన వరుస నాలుగు ద్వైమాసిక సమీక్షల కాలంలో ఈ రేటును ఆర్‌బీఐ 1.1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 5.40 శాతానికి దిగివచ్చింది.  తమకు అందివచ్చిన ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలని అటు కేంద్రం, ఇటు ఆర్‌బీఐ బ్యాకింగ్‌కు సూచిస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, వృద్ధి వేగం పుంజుకోకపోవడం వంటి అంశాల నేపథ్యంలో రేటు కోత మరింత ఉండవచ్చన్నది విశ్లేషణ.

విశ్లేషణ నేపథ్యం...
 దేశ స్థూల  దేశీయోత్పత్తి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. కన్జూమర్‌ విశ్వాసం దెబ్బతింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో పటిష్టత లేదు. ఆటో రంగం తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటోంది. ఆటో అనుబంధ రంగాల్లో భారీగా ఉపాధి దెబ్బతింటోంది. ఇక రియల్టీలో విక్రయంకాని గృహాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ కంపెనీల వృద్ధి స్పీడ్‌ తగ్గిన సంకేతాలు సుస్పష్టం. భారీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లోనూ నిరాశ నెలకొంటోంది. ఆయా అంశాలు రేటు తగ్గింపునకే దారితీస్తాయన్నది ఫిచ్‌ విశ్లేషణ. ద్రవ్యోల్బణం 2019-20లో సగటును 3.8 శాతంగా ఉంటుందన్నది ఫిచ్‌ అభిప్రాయం. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)​కు కేంద్ర నిర్దేశిత స్థాయి కావడం గమనార్హం. 2 శాతానికి ప్లస్‌ 2 శాతం లేదా మైనస్‌ 2 శాతంగా ఉండేలా చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచిస్తోంది.  అంటే 4 శాతం దాటితే ధరల తీవ్రతను మైనస్‌లోకి వెళితే వ్యవస్థలోని మందగమన పరిస్థితులకు ఇది సంకేతంగా ఉంటుంది. You may be interested

ఇక 70-72 మధ్య రూపాయి

Saturday 17th August 2019

శుక్రవారం 13 పైసలు లాభం 71.14 వద్ద ముగింపు ముంబై: రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ శుక్రవారం 13 పైసలు లాభపడి 71.14 వద్ద ముగిసింది. అయితే ఇది షార్ట్‌కవరింగ్‌గా భావించడం జరుగుతోందని, రూపాయి రానున్న పక్షం రోజుల్లో మరింత బలహీనపడే అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు అంచనా. సమీపకాలంలో 70-72 శ్రేణిలో తిరిగే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రూపాయి శుక్రవారం బలహీన

ఆమ్‌టెక్‌ ఆటో లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్‌

Saturday 17th August 2019

న్యూఢిల్లీ: ఆమ్టెక్‌ ఆటో లిక్విడేషన్‌ (ఆస్తుల విక్రయం)కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ వ్యాపారాన్ని మూసేసి, ఆస్తులను విక్రయించగా వచ్చిన నిధులను రుణాలిచ్చిన సంస్థలకు చెల్లించడమే లిక్విడేషన్‌. సదరు కంపెనీ రిజిస్ట్రేషన్‌ కూడా రద్దవుతుంది. ఆమ్టెక్‌ ఆటో దివాలా పరిష్కార ప్రక్రియకు ఇచ్చిన గడువును పొడిగించాలంటూ రుణాలిచ్చిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. ఆర్‌బీఐ 2017లో దివాలా చర్యలు చేపట్టాలంటూ

Most from this category