News


బ్యాంకుల మొండిచేయి!

Friday 7th June 2019
news_main1559887322.png-26147

ఆర్‌బీఐ రేటు కోత ప్రక్రియకు శ్రీకారం చుట్టినా, బ్యాంకులు మాత్రం భారీ రేటు తగ్గింపులకు ఎటువంటి హామీలూ ఇవ్వకపోతుండడం గమనించాల్సిన విషయం. ఆర్‌బీఐ రేటు తగ్గింపు వృద్ధికి ఊతం ఇస్తుందని ఒకపక్క పేర్కొంటున్న బ్యాంకులు, అయితే  తాము ఏ మేరకు రేటు తగ్గింపును చేపడతాయన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు. తమకు అందివస్తున్న ప్రయోజనాన్ని కస్టమర్‌కు బదలాయించండంటూ స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ చేస్తున్న సూచనలను వాస్తవంలో అమలు చేయడంపై బ్యాంకులు పెద్దగా సానుకూలత చూపడంలేదనే భావించవచ్చు. జనవరి నుంచీ జూన్‌ 6వ తేదీ వరకూ ఆర్‌బీఐ అరశాతం రేటు తగ్గిస్తే, బ్యాంకింగ్‌ ఇందులో 0.21 శాతాన్నే కస్టమర్‌కు బదలాయించడం గమనార్హం. ఇదికూడా కొత్త రుణ గ్రహీతలకే వర్తిస్తున్నారు తప్ప, ఇప్పటికే రుణ మార్కెట్‌లో ఉన్న వారికి ఈ ప్రయోజనం అందడం లేదన్న విమర్శ ఉంది. ఆర్‌బీఐ నిర్ణయానికి సార్థకత చేకూరాలంటే, బ్యాంకింగ్‌ రేటు తగ్గింపు కీలకమని టాటా క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజీవ్‌ సబర్వాల్‌ పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా బ్యాంకులు తదుపరి రేటు తగ్గింపు నిర్ణయాలు తీసుకోవాలని ఇండస్ట్రీ లాబీ ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ సునిల్‌ మెహతా పేర్కొన్నారు. తాజా ఆర్‌బీఐ నిర్ణయంపై కొందరు బ్యాంకర్ల అభిప్రాయాలను చూస్తే....
----------
ద్రవ్య వ్యవస్థకు సానుకూలం
ద్రవ్య విధానాన్ని ‘తటస్థ’ వైఖరి నుంచి ‘తగిన విధంగా మార్చుకునే వెసులుబాటు’కు ఆర్‌బీఐ మార్చింది. ఫైనాన్షియల్‌ వ్యవస్థకు దోహదపడే అంశం ఇది. వడ్డీరేట్ల తగ్గింపునకు దోహదపడే నిర్ణయం కూడా. వృద్ధికి ఊపు నివ్వడం లక్ష్యంగా జరిగిన విధాన నిర్ణయాలు ఇవి. బ్యాంకులకు బాసెల్‌ 3 నిధుల అవసరాలను తగ్గించడం బ్యాంకులకు లిక్వడిటీ (ద్రవ్యలభ్యత) పెంచుతుంది. ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ చార్జీల రద్దు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. 
- రజ్‌నీష్‌ కుమార్‌, ఎస్‌బీఐ చైర్మన్‌

వృద్ధే లక్ష్యం...
సమీప భవిష్యత్తులో వృద్ధికి ప్రోత్సాహమిచ్చే దిశలో ఆర్‌బీఐ నిర్ణయం ఉంది. ముఖ్యంగా బాసెల్‌ 3కి సంబంధించి ద్రవ్య అవసరాల నిష్పత్తిని తగ్గించడం బ్యాంకింగ్‌కు సానుకూల అంశం. 
- దీనబంధూ మహాపాత్ర, 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ
-------------------
సానుకూలత అపారం
ఆర్‌బీఐ విధానం ఎంతో సానుకూల చర్య. మరిన్ని దఫాలు రేటు తగ్గింపులకు అవకాశం ఉంది. వృద్ధికి దోహదపడుతుంది. ప్రైవేటు పెట్టుబడులను పెంచుతుంది. ఫైనాన్షియల్‌ స్థిరత్వానికి తగిన అన్ని చర్యలూ తీసుకుంటామని గవర్నర్‌ చేసిన ప్రకటన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) కోణంలో మేలు చేసే అంశం. 
- పీ ప్రసన్న, గ్లోబల్‌ మర్కెట్స్‌ హెడ్‌,
ఐసీఐసీఐ బ్యాంక్‌

--------------
ఆగస్టులో మరో దఫా కోత
ఆగస్టు సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ మరో దఫా రేటు కోతకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు తర్వాత రేటు తగ్గింపు ప్రక్రియ కొనసాగే వీలుంది. అంతర్జాతీయంగా ఎదరవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి ఈ చర్యలు తప్పవు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
--------------
రేటు తగ్గింపునకు అవకాశం
భవిష్యత్తులో మరిన్ని రేటు కోత నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నాం. రానున్న నెలల్లో 75 బేసిస్‌ పాయింట్ల రేటు కోత ఉండవచ్చు. బ్యాంకింగ్‌ రేటు కోత తప్పని పరిస్థితులు దీనితో ఏర్పడతాయి. కాగా రుణ రేట్లతో పాటు డిపాజిట్‌ రేట్లూ రానున్న రోజుల్లో వేగంగా తగ్గే అవకాశం ఉంది. 
- ఆర్‌కే గురుమూర్తి, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, ట్రెజరీ హెడ్‌
---------------
అంతా బ్యాంకుల దయ: రియల్టర్లు
ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం గృహ విక్రయ రంగానికి సానుకూలమైనదేనని రియల్టర్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్రయోజనాన్ని బ్యాంకర్లు కస్టమర్లకు బదలాయించడంపై రియల్టీ పరిస్థితులు ఆధారపడి ఉంటాయని వారు పేర్కొన్నారు. క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ మాగర్‌ మాట్లాడుతూ, తాజా ఆర్‌బీఐ నిర్ణయాన్ని బ్యాంకులు వినియోగదారుకు బదలాయించాలని  సూచించారు. క్రెడాయ్‌ చైర్మన్‌ జాక్సాయ్‌ షా, ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ హిరనందిని కూడా ఇదే విధమైన ప్రకటనలు చేశారు. 

 You may be interested

ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలపై రుసుముల తొలగింపు

Friday 7th June 2019

ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసే బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త ప్రకటించింది. ఆర్టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చేసే నగదు బదిలీలపై ఛార్జీలను తొలగిస్తున్నట్లు తెలిపింది. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, బ్యాంకులు ఈ ప్రయోజనాలను తమ ఖాతాదారులకు బదిలీ చేయాలని ఆదేశించామని తెలిపింది.  దీంతో పాటు ఏటీఎం ఛార్జీలను కూడా

రెపో తగ్గింది.. మరి వడ్డీయో?

Friday 7th June 2019

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ దీనితో తొమ్మిదేళ్ల కనిష్ఠం 5.75 శాతానికి ఆరుగురు బోర్డు సభ్యుల ఏకగ్రీవ నిర్ణయం గత ఆరునెలల్లో 0.75 శాతం తగ్గిన రెపో కానీ రుణాలపై ఆ మేరకు వడ్డీ తగ్గించని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీకి మాత్రం ఎప్పటికప్పుడు కోతలు ఇలాగైతే రుణాల్లో వృద్ధి ఉండదంటున్న రేటింగ్‌ సంస్థలు బ్యాంకర్లతో మాట్లాతానన్న ఆర్‌బీఐ గవర్నర్‌ ముంబై: అంచనాలు, విశ్లేషణలకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనితో

Most from this category