News


ఎన్‌హెచ్‌బీ ఆధ్వర్యంలో ఇంటర్‌మీడియరీ

Tuesday 10th September 2019
news_main1568092248.png-28282

  • గృహ రుణాల సెక్యూరిటైజేషన్‌ మార్కెట్‌పై కమిటీ సిఫారసులు

ముంబై: గృహ రుణ సెక్యూరిటైజేషన్‌ మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు చేసింది. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) ఆధ్వర్యంలో ఓ మధ్యవర్తిత్వ (ఇంటర్‌ మీడియరీ) సంస్థను 51 శాతం ప్రభుత్వ వాటాతో ఏర్పాటు చేయాలని సూచించింది. బెయిన్‌ అండ్‌ కో సీనియర్‌ అడ్వైజర్‌ హర్ష్‌ వర్ధన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 29న ఆర్‌బీఐ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను సోమవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌కు సమర్పించింది. గృహ రుణాల సెక్యూరిటైజేషన్‌ అంటే... రుణాలను ప్రత్యేక ప్రయోజన విభాగం (ఎస్‌పీవీ)కు బదిలీ చేయడం. ఆ సంస్థ ఆయా రుణాలకు సంబంధించి సెక్యూరిటీలను జారీ చేస్తుంది. వీటిని పాస్‌ త్రూ సర్టిఫికెట్స్‌ (పీటీసీ) అని పిలుస్తారు. ఈ సర్టిఫికెట్లకు అనుసంధానంగా రుణాలు ఉంటాయి. దీనివల్ల రుణాలిచ్చిన సంస్థలు, ఆయా రుణాలను లిక్విడ్‌ సెక్యూరిటీలు (ట్రేడ్‌ అయ్యేవి)గా మార్చుకోగలవు. 



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆర్థిక ప్యాకేజీ

Tuesday 10th September 2019

ఆర్థిక శాఖా పరిశీలనలో ఉంది కేంద్ర మంత్రి మేఘ్‌వాల్‌ కోచి: నిధుల్లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్‌వాల్‌ తెలిపారు. భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల శాఖా మంత్రి అయిన ఆయన సోమవారం కోచి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, అదే ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం

హైదరాబాద్‌ వద్ద ఇన్నోలియా ప్లాంటు

Tuesday 10th September 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలోని యూఎస్‌ కంపెనీ ఇన్నోలియా ఎనర్జీ హైదరాబాద్‌ వద్ద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రూ.225 కోట్ల వ్యయంతో చౌటుప్పల్‌ వద్ద నెలకొల్పిన ఈ కేంద్రం సామర్థ్యం 300 మెగావాట్లు. సోలార్‌, లిథియం బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ రంగానికి అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. 

Most from this category