News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పరిష్కార ప్రక్రియ వేగవంతం

Saturday 23rd November 2019
news_main1574479376.png-29798

  • అడ్వైజరీ కమిటీని నియమించిన ఆర్‌బీఐ

ముంబై: దివాన్ హౌసింగ్‌ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్‌) దివాలా పరిష్కార ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ వేగవంతం చేసింది. ఈ విషయంలో అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు, సూచనలు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ లాల్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో ఎన్‌ఎస్ కణ్ణన్, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ సీఈవో ఎన్‌ఎస్ వెంకటేష్ సభ్యులుగా ఉన్నారు. అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ మాజీ ఎండీ సుబ్రమణియకుమార్‌కు ఈ కమిటీ తగు విధంగా తోడ్పాటు అందిస్తుందని ఆర్‌బీఐ వెల్లడించింది. బ్యాంకులకు సుమారు రూ. 83,873 కోట్ల మేర బాకీ పడిన డీహెచ్‌ఎఫ్ఎల్ .. దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న తొలి నాన్‌-బ్యా్ంకింగ్‌ ఫైనాన్స్‌/హౌసింగ్ సంస్థ. దివాలా స్మృతికి సంబంధించి ఇటీవల నోటిఫై చేసిన సెక్షన్ 227 ప్రకారం డీహెచ్‌ఎఫ్ఎల్‌ బోర్డును ఆర్‌బీఐ తన ఆజమాయిషీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్‌కు ఇచ్చిన రుణాల్లో కొంత భాగానికి ప్రతిగా కంపెనీలో 51 శాతం దాకా వాటాలు తీసుకునే అంశాన్ని కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పరిశీలిస్తున్నాయి. 



You may be interested

పెట్టుబడుల ఆకర్షణ మంత్రం

Saturday 23rd November 2019

భారీ ప్రోత్సాహకాలపై కేంద్రం కసరత్తు 324 విదేశీ దిగ్గజ సంస్థలపై దృష్టి జాబితాలో టెస్లా, గ్లాక్సో తదితర కంపెనీలు     అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత్‌ దృష్టి సారిస్తోంది. బహుళజాతి సంస్థలను ఇటు రప్పించేందుకు తీసుకోతగిన చర్యలపై కసరత్తు చేస్తోంది.  టెస్లా, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ వంటి 324 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే సంస్థలకు స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు, రోడ్డు

కార్వీపై సెబీ ఆంక్షలు..

Saturday 23rd November 2019

కొత్త క్లయింట్లు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు న్యూఢిల్లీ: క్లయింట్లకు సంబంధించిన రూ. 2,000 కోట్ల విలువ చేసే సెక్యూరిటీస్‌ను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్‌)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాల కోసం కొత్తగా క్లయింట్లను తీసుకోకుండా నిషేధించింది. అలాగే, క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీల ఆధారంగా కేఎస్‌బీఎల్‌ ఎలాంటి సూచనలు ఇచ్చినా.. పరిగణనలోకి తీసుకోరాదంటూ ఎన్‌ఎస్‌డీఎల్‌, సీడీఎస్‌ఎల్‌ను ఆదేశించింది.

Most from this category