News


అర్‌బీఐ వైపు అందరి చూపు

Tuesday 4th February 2020
news_main1580785735.png-31479

  • ఆర్థిక సంవత్సరం చివరి భేటీ

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 6వ తేదీ వరకూ ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్‌బీఐ పాలసీ సమావేశం ఇది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగమనం, ద్రవ్యోల్బణం కట్టుతప్పడం వంటి ప్రతికూలతల నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. ధరలూ సామాన్యునిపై భారాన్ని మోపుతున్నాయి. మొత్తంగా గణాంకాలు దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తుండగా, నిత్యావసరాల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి.  

కట్టుతప్పిన ద్రవ్యోల్బణం...
రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్‌ 2’ లేదా ‘మైనస్‌ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ‍ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి.  2018 డిసెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.11 శాతంగా ఉండగా, 2019 నవంబర్‌లో 5.54 శాతంగాను, డిసెంబర్‌లో 7.35 శాతంగాను నమోదైంది. చివరిసారిగా 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్‌లో తాకడం ఇదే ప్రథమం. ఆర్‌బీఐ పాలసీ విధానానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. ఇక దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ, డిసెంబర్‌లో టోకు ద్రవ్యో‍ల్బణం  2.59 శాతంగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం ఏమిటన్నది వేచిచూడాల్సి ఉంది. 

ఆరు సార్లలో ఐదు సార్లు తగ్గింపు...
ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని డిసెంబర్‌ 5 మధ్య జరిగిన ఆరు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి మినహా అంతకుముందు వరుసగా ఐదు ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే వసూలు చేసే వడ్డీరేటు- రెపోను 135 బేసిస్‌ పాయింట్లమేర ఆర్‌బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి సమావేశంలో ఈ దిశలో నిర్ణయం తీసుకోలేకపోయింది. 
 



You may be interested

ఇన్‌ఫ్రా కోసమే డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు..

Tuesday 4th February 2020

ఫిక్కీ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తామని.. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఇది అనేక రకాలుగా సానుకూల ప్రభావం చూపగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. "సమీకరించిన

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Tuesday 4th February 2020

భారతీ ఎయిర్‌టెల్‌, టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ, త్రివేణి ఇంజనీరింగ్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌, టైటాన్‌ కంపెనీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సీఎస్‌బీ, బ్యాంక్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, గతి, జిందాల్‌ సా, అదానీ ఎనర్జీ గ్రీన్‌, అవంతి ఫీడ్స్‌లు కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్పరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. 

Most from this category