News


ఆర్‌టీజీఎస్‌ వేళలు మార్పు

Thursday 22nd August 2019
news_main1566446474.png-27933

  • ఉదయం 7 గం.ల నుంచే ప్రారంభం

భారీ పరిమాణంలో నగదు బదిలీకి ఉపయోగించే ఆర్‌టీజీఎస్‌ సిస్టమ్ వేళలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. రియల్‌ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్‌) విధానంలో రూ. 2 లక్షల పైబడిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేయొచ్చు. దీని వేళలు ఇప్పుడు కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల దాకా, ఇంటర్‌బ్యాంక్‌ లావాదేవీల కోసం రాత్రి 7.45 గం.ల దాకా ఉంటున్నాయి. ప్రస్తుతం రూ. 2 లక్షల లోపు నిధుల బదిలీ కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) ఉపయోగిస్తున్నారు. దీని వేళలు ఉదయం 8 గం.ల నుంచి రాత్రి 7 గం.ల దాకా ఉంటున్నాయి. 



You may be interested

వృద్ధి 5.7 శాతమే!: నోమురా

Thursday 22nd August 2019

ఏప్రిల్‌-జూన్‌పై అంచనా న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 5.7 శాతమే నమోదవుతుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ-  నోమురా అంచనావేసింది. వినియోగం పడిపోవడం, పెట్టుబడుల బలహీనత, సేవల రంగం పేలవంగా ఉండడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని సంస్థ అంచనావేసింది. మందగమన పరిస్థితులకు ఇక తొలగిపోతున్నట్లు సంకేతాలు అందుతున్నట్లు

సెబీ స్మార్ట్‌ నిర్ణయాలు

Thursday 22nd August 2019

ఆమోదం తెలిపిన సెబీ  సూచీల్లోకి స్టార్టప్‌లు మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ సూచనలు  మరికొన్ని ప్రతిపాదనలకు సెబీ పచ్చజెండా    స్టార్టప్‌లకు జోష్‌నిచ్చే నిర్ణయాలను సెబీ తీసుకుంది. మునిసిపల్‌ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును స్మార్ట్‌ సిటీస్‌కు కల్పించింది. వీటితో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను కూడా ప్రకటించింది. మరోవైపు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులకు సంబంధించి సమాచారమందించే వ్యక్తులకు రూ. కోటి నజరానా ఇస్తామని ప్రకటించింది. హౌసింగ్‌ ఫైనాన్స్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌

Most from this category