STOCKS

News


2 వేల నోటు కనబడుటలేదు!!

Wednesday 16th October 2019
news_main1571196990.png-28906

  • ఈ ఏడాది ఒక్క నోటు కూడా ముద్రించలేదు
  • వెల్లడించిన రిజర్వ్‌ బ్యాంక్‌...

న్యూఢిల్లీ: ఈమధ్య ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు అంతగా రాకపోవడాన్ని గమనించారా... గతంలో పెద్దమొత్తంలో నగదు తీస్తే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే రూ.2 వేల నోట్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య బాగా తగ్గింది. దీనికి కారణం లేకపోలేదు... గతంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన మరింత పెద్ద నోటు రూ. 2,000 ముద్రణ ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడమే! భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు సమాధానమిచ్చింది. పక్కా అసలు నోట్లుగా అనిపించే నకిలీ కరెన్సీ నోట్లు మళ్లీ చలామణీలోకి వస్తున్నాయంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్‌బీఐ సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే 2016 నవంబర్‌లో రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఆ తర్వాత రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 
    సంఖ్యాపరంగా 2016-17లో 354.2 కోట్ల రూ. 2,000 నోట్ల ముద్రణ జరగ్గా ఆ మరుసటి ఏడాది గణనీయంగా తగ్గి 111.5 కోట్లకు పరిమితమైంది. 2018-19లో ఆర్‌బీఐ 4.66 కోట్ల నోట్లు ముద్రితమయ్యాయి. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల మేర రూ. 2,000 నోట్లు చలామణీలో ఉండగా 2019 నాటికి 329.1 కోట్లకు తగ్గాయి. నల్లధనం కూడబెట్టుకునేందుకు పెద్ద నోట్లను దాచిపెట్టుకోవడాన్ని నిరోధించే ఉద్దేశంతోనే రూ. 2,000 నోట్ల ముద్రణను ఆర్‌బీఐ తగ్గిస్తుండవచ్చని నిపుణులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో రూ. 6 కోట్ల విలువ చేసే రూ. 2,000 నోట్లు పట్టుబడటం (లెక్కల్లో చూపని) ఈ అభిప్రాయాలకు ఊతమిస్తోంది. మరోవైపు, బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ. 2,000 కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2016-17లో 678 నకిలీ నోట్లు దొరకగా, 2017-18లో 17,929 నోట్లు బైటపడ్డాయి. You may be interested

భారత్‌లో తొలి 5జీ లైవ్‌ వీడియో కాల్‌

Wednesday 16th October 2019

భారత్‌లో తొలి 5జీ లైవ్‌ వీడియో కాల్‌ క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో ప్రదర్శించిన ఎరిక్సన్‌ న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్‌ 5జీ లైవ్‌ వీడియో కాల్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించింది. ఇది భారత్‌లో తొలి 5జీ వీడియో కాల్‌ అని, క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్‌ హెడ్‌(సౌత్‌ ఈస్ట్‌ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్‌జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్‌(ఎమ్‌ఎమ్‌వేవ్‌-28 గిగా హెట్జ్‌, 38 గిగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ బాండ్స్‌)

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొన్న షేర్లివే

Tuesday 15th October 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) అన్నింటిలోనూ నిర్వహణ ఆస్తుల విలువ పరంగా ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ మూడో స్థానంలో ఉంది. ఈక్విటీల్లో అధిక ఆస్తులు కలిగి ఉన్నది మాత్రం ఎస్‌బీఐ. సెప్టెంబర్‌ మాసంలో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ విద్యుత్‌, ఇంధన, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసింది. అలాగే, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగంలో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, చోలమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌, సిటీ యూనియన్‌

Most from this category